25.2 C
Hyderabad
May 8, 2024 08: 58 AM
Slider కరీంనగర్

హూజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

#harishrao

పిసిసి నాయకులు కౌశిక్, కశ్యప్ రెడ్డిలతో కలిసి వేల మంది కార్యకర్తలు కాంగ్రెసును వీడి టిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు కె.వెంకన్న, డిసిసి అధికార ప్రతినిధి సలీంల నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు, యువకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆబాదీ జమ్మికుంటలోని కాటన్ మిల్లులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, శ్రీనివాస్,టిఆర్ఎస్ నాయకులు సమ్మిరెడ్డి, కశ్యప్ రెడ్డి, కోటి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెసు నుంచి వచ్చిన వారికి మంత్రులు గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ లోకి సాదర స్వాగతం పలికారు. కాటన్ మిల్లులో పని చేసే హమాలీలందరూ తామంతా కూడా టిఆర్ఎస్, ముఖ్యమంత్రి కెసిఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ప్రతిని మంత్రులకు అందించారు.

ఈ సందర్భంగా కాటన్ మిల్లు ప్రాంగణం జై తెలంగాణ జై కెసిఆర్ జై టిఆర్ఎస్ కారు గుర్తుకే మన ఓటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తాం, గెలిపిస్తాం అనే నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ హమాలీల సమస్యలన్నింటినీ తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెసు, బిజెపి జాతీయ స్థాయిలో కొట్లాడుతాయి కానీ హుజూరాబాద్ లో మాత్రం కలిసి పోయినాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతులకు బీమా 5 లక్షలు ఇస్తున్నది ఒక కెసిఆర్ మాత్రమే. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నది తెలంగాణలోనే. 24గంటలు కరంటు ఇస్తున్నది కెసిఆర్. అభివృద్ధి, సంక్షేమానికి రోల్ మోడల్ తెలంగాణ. దేశానికి ఆదర్శంగా,మోడల్ గా నిలిచింది అని ఆయన అన్నారు.

Related posts

అధికారుల వైఖరిపై కరెంటు స్తంభం ఎక్కి నిరసన

Satyam NEWS

ఎటాకింగ్ పాలిటిక్స్ కాదు… ప్లానింగ్ పాలిటిక్స్ కావాలి

Satyam NEWS

న్యూ ట్రెండ్:రామాయణ కథాంశం ఆధారంగా కొత్త రైలు

Satyam NEWS

Leave a Comment