38.2 C
Hyderabad
May 5, 2024 22: 35 PM
Slider నల్గొండ

JEE Mains, NEET పరీక్షలను వాయిదా వేయాలి

#TelanganaCongress

దేశంలో కరోనా  కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాతీయ స్థాయిలో నిర్వహించే JEE Mains, NEET ఎంట్రెన్స్ పరీక్షలను  వాయిదా వెయ్యాలని టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా  డిమాండ్ చేశారు.

శుక్రవారం నాడు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  పిలుపు మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆదేశాల మేరకు ఈ రోజు దేశ వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు.

రోజు రోజుకు కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూ,  ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటూ, విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో JEE Mains & NEET Exam’s  కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులు మానసిక  ఒత్తిడికి లోనవుతూ, భయాందోళన  చెందుతున్నారని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పరీక్షలను వాయిదా వెయ్యాలని కోరారు. ఈ పరీక్ష పూర్తిగా  ఆన్ లైన్  విధానం ద్వారా నిర్వహించడం, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పేస్ షీల్డ్  మాస్కులు ధరించి 3 గంటలపాటు కంప్యూటర్ చూస్తూ దృష్టిని కేంద్రీకరించడం ద్వారా  అయోమయానికి గురి అవుతూ  ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని ఆయన అన్నారు.

రవాణా సౌకర్యం సరిగా  లేకపోవడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు.

Related posts

అటల్ బిహారీ వాజ్ పేయికి చంద్రబాబు నివాళి

Satyam NEWS

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం

Satyam NEWS

ఉద్యోగులకు నిరుద్యోగులకు ఆశాకిరణం రాములు నాయక్

Satyam NEWS

Leave a Comment