సహకార సంఘాల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు తెరాసకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ‘రైతు బంధు’ తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని ,ఈఆరేళ్లలో రాష్ట్రంలో ఆరువేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.
రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందన్నారు. పసుపు మద్దతు ధర అంశాన్ని కేంద్రంపై నెట్టి తెరాస ప్రభుత్వ చేతులెత్తేసింది ఆక్షేపించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పసుపునకు రూ. 6,850 మద్దతు ధర ఇస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి ఇక్కడి రైతులను ఆదుకోవాలని కోరారు.