38.2 C
Hyderabad
May 5, 2024 20: 09 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు

#TTD

కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలు ఫిబ్ర‌‌వ‌రి 10 నుండి 12వ తేదీ వ‌రకు తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు సుప్రభాతం, ధ్యానం, స‌మూహిక భజన‌లు, నగర సంకీర్తన నిర్వహించనున్నారు. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో శ్రీ పురంద‌ర దాస సంకీర్త‌న‌మాల జ‌రుగ‌నుంది.

అనంత‌రం ఉదయం 9:30 మరియు మధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు బెంగుళూరుకు  చెందిన వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ, ఉడిపికి చెందిన పుత్తిగే మఠాధిపతి శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ, పా‌లిమారు మఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కుక్కె సుబ్ర‌హ్మ‌ణ్యంస్వామి మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ‌ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీలు మంగ‌ళ శాస‌న‌ములు అందించ‌నున్నారు.

కాగా, ఫిబ్రవరి 11 న సాయంత్రం 6 గంటలకు సాయంత్రం స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఊరేగింపుగా నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేస్తారు. అక్క‌డున్న శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌య మండ‌పంలో  శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ పురంద‌ర‌దాస కీర్త‌న‌ల‌ను బృంద‌గానం చేస్తారు.

1480వ సంవ‌త్స‌వం కర్ణాటకలో జన్మించిన శ్రీ శ్రీనివాస నాయక తరువాత పురంధర దాస‌గా మారి తన 84 సంవత్సరాల జీవితకాలంలో దాదాపు 4.75 ల‌క్ష‌ల‌ సంకీర్త‌న‌ల‌ను రాశారు. 1564 లో శ్రీ‌వారిలో ఐక్య‌మైనారు.

తెలుగు ప‌ద పితామహుడైన‌ శ్రీ తాళ్ల‌పాక అన్నమాచార్యులు మాదిరిగానే, శ్రీ పురంధర దాస కూడా తన సంకీర్తనాల ద్వారా శ్రీ వేంక‌టేశ్వరుడికి విశేష‌ సేవ చేసారు. టిటిడి 1979 లో దాసా సాహిత్య ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుండి ప్రతి సంవత్సరం శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలను నిర్వ‌హిస్తున్న‌ది. తిరుమ‌ల‌లో 2006వ సంవ‌త్స‌రం నుండి శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవాలను పుర‌స్క‌రించుకొని టిటిడి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారిని నారాయణగిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేయ‌డం ఆనవాయితీగా వస్తోంది.

దాస‌ సాహిత్య ప్రాజెక్ట్ ప్ర‌త్యేకాధికారి శ్రీ పి ఆర్ ఆనంద తీర్థచార్యులు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Related posts

ఇళ్ల పట్టాల కోసం అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన

Satyam NEWS

డిమాండ్: వలసకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మల్లన్న ను దర్శించుకుందాం

Satyam NEWS

Leave a Comment