26.2 C
Hyderabad
October 15, 2024 12: 31 PM
Slider ఖమ్మం

గో గ్రీన్: పచ్చదనం, పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యం

puvvada 13

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే కర్తవ్యంగా పని చేయాలని పంచాయతీ రాజ్ ముఖ్యులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం భక్తరామ దాస్ కళాక్షేత్రంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పంచాయతీ రాజ్ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

జిల్లా కలెక్టర్ RV కర్ణన్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, సండ్ర వెంకట వీరయ్య, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, జడ్పీ CEO ప్రియాంక, డిఆర్డీఏ PD ఇందుమతి జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిపి లు, ఎంపిటిసి లు, జడ్పీటీసీ లు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోపచర్చలు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని వాటికి ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు చేసి గ్రామాభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

మన ముందు ఉన్నది అత్యంత ప్రాధాన్యతతో కూడిన పని పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడమే. అదే మనకు అత్యంత ముఖ్యమైన పనిగా తీసుకోవాలని మంత్రి అన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం లక్ష్యంగా ఇప్పటి వరకు రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం ఇదే విధంగా కోనసాగాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలి.

వాటిని సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. మురికి గుంటలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుపడిన బావులు పూడ్చివేయాలి. పాత బోరుబావులను పూడ్చాలి. ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో జరిపించాలి అని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు పల్లె ప్రగతిలో ఖమ్మం జిల్లా నలుగోవ స్థానంలో ఉంది. వచ్చే 3వ విడతలో నెం.1 స్థానంను రావాలని మంత్రి ఆకాంక్షించారు.

ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి పిలుపునిచ్చారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను ఖచ్చితంగా బతికించాలి. గ్రామంలో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డు, వైకుంటాధమం, ఇంకుడు గుంతలు, నర్సరీ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. చెట్లకు నీళ్లు పోయడానికి, చెత్త ఎత్తివేయడానికి ట్రాక్టర్ ను వినియోగించాలని ఆయన అన్నారు.

Related posts

గోదావరి నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ప్రజల ప్రాణాల కంటే కెసిఆర్ కు ఎన్నికలే ముఖ్యం

Satyam NEWS

బ్రాహ్మణులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం

Bhavani

Leave a Comment