25.2 C
Hyderabad
October 15, 2024 11: 31 AM
Slider ప్రత్యేకం

క్రిమినల్స్ డిక్లరేషన్: రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు షాక్

supreme court

తమ తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను తమ పార్టీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సుప్రీం కోర్టు నేడు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. రాజకీయాలలో నేరస్తులు పెరిగిపోవడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

తమ వెబ్ సైట్ లో పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల వివరాలను పెట్టడమే కాకుండా అలాంటి నేరస్తులను ఎంపిక చేయడానికి కారణాలను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి గల కారణాలను అంటే అర్హత, యోగ్యతకు సంబంధించిన సూచనతో న్యాయబద్ధమైన వాటిని ప్రస్తావించాలని ఆదేశించారు.

కేవలం గెలిచే అవకాశం ఉన్నందునే ఎంపిక చేశామని చెబితే కుదరదని ఆయన అన్నారు. అభ్యర్థుల నేరపూరిత వివరాలను బహిర్గత పరచడానికి సంబంధించి సెప్టెంబర్ 2018న సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పును చాలా పార్టీలు పాటించడం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

రాజకీయ పార్టీలు తమ తమ పార్టీలలో ఉన్న నేరస్తుల వివరాలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో, ఒక స్థానిక దినపత్రిక, ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించాలని నిర్దేశించింది కానీ వాటిని ఎవరూ ఫాలో కావడం లేదు.  రాజకీయ పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసిన 72 గంటల లోపు ఎన్నికల కమిషన్ కు ఈ విషయంలో నివేదికను సమర్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ పార్టీలు తన ఆదేశాలను పాటించడంలో విఫలం అయినట్లయితే, ఎన్నికల సంఘం దానిని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలని నిర్దేశించింది.

Related posts

రోడ్ ప్ర‌మాదల నివార‌ణ‌కు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లే మార్గం….!

Satyam NEWS

అడగకుండానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

Satyam NEWS

ప్రజా నాయకుడు రత్న ప్రభాకర్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment