35.2 C
Hyderabad
May 11, 2024 18: 57 PM
Slider నల్గొండ

మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

#tntuc

మేడే అంటే ప్రపంచ కార్మికుల పండుగని,చారిత్రక విశిష్టత సంతరించుకున్న మేడే వేతనాల కోసం, ఎనిమిది గంటల పని దినం కోసం,దోపిడీపై ఎదురు తిరిగి పోరాడిన ఎందరో కార్మికులు నేల కోరిన రోజని,కార్మిక హక్కులని హరించే కేంద్ర లోని బిజెపి ప్రభుత్వంపై మరో పోరాటానికి నాంది పలకాలని టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్మికుల ముఖ్య సమావేశంలో శీతల రోషపతి పాల్గొని మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీసం వేతనం 26,000 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,కేంద్ర ప్రభుత్వం చట్టాల సవరణ పేరుతో కార్మిక చట్టాలను రద్దు చేస్తే దానిపై పోరాటం చేయటానికి సిద్దం కావాలని,రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని వివిధ డిమాండ్లతో  మే ఒకటో తేదీన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని,అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని రోషపతి కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ,మెరుగ దుర్గారావు,కస్తాల సైదులు,రవి,కుమార్,పద్మ,కోటమ్మ, రామయ్య,దేవకర్ణ,వెంకన్న,చంద్రకళ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఏనుగు హ‌ల్‌చ‌ల్‌.. భ‌యాందోళ‌న‌లో స్థానికులు

Sub Editor

శీతాకాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

Bhavani

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment