27.7 C
Hyderabad
May 14, 2024 11: 06 AM
Slider జాతీయం

భారీ నష్టపరిహారాన్ని ఆఫర్ చేసిన జాన్సన్ & జాన్సన్

#Johnson talcum powder

క్యాన్సర్ కారకాలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్ కంపెనీ ఆరోపణలు రుజువైతే పరిహారంగా ఇచ్చేందుకు భారీ మొత్తాన్ని కేటాయించింది. మొత్తం 890 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ. 73,086 కోట్లు పరిహారం కింద కేటాయించేందుకు నిర్ణయించినట్లు న్యాయస్థానానికి తెలిపింది. క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా తన ఉత్పత్తులను అమెరికా, కెనడాలలో అమ్మడాన్ని నిలిపివేసింది.

జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ పౌడర్ వాడటం వల్ల తమకు క్యాన్సర్ సోకిందని పలువురు ఇప్పటికే పలు న్యాయస్థానాలలో కేసులు దాఖలు చేశారు. టాల్కమ్ పౌడర్‌లో అండాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే ఆస్బెస్టాస్ జాడలు ఉన్నాయని ఇప్పటికే పలువురు ఆరోపించారు. అయితే ఆ కంపెనీ ఎలాంటి తప్పును అంగీకరించలేదు. జాన్సన్ & జాన్సన్‌లో లిటిగేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ హాస్ ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. “ఈ వాదనలు తప్పు శాస్త్రీయత లేనివని కంపెనీ విశ్వసిస్తోంది” అని అన్నారు.

జాన్సన్ & జాన్సన్ కంపెనీ ప్రకారం, దాని అనుబంధ సంస్థ LTL మేనేజ్‌మెంట్ LLC ద్వారా రాబోయే 25 సంవత్సరాలలో వేలాది మంది క్లెయిమ్‌లకు US$890 మిలియన్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్లెయిమ్‌లను నిర్వహించడానికి LTL మేనేజ్‌మెంట్ LLC ఏర్పడింది. తమ టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు సురక్షితంగా ఉన్నాయనికంపెనీ పేర్కొంది. జాన్సన్ & జాన్సన్ కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ ను న్యాయస్థానం అంగీకరించాల్సి ఉంటుంది.

Related posts

డివైన్ పవర్: మల్లేశ్వర స్వామి వారి పల్లకి సేవ

Satyam NEWS

పార్లమెంట్ ను రాష్ట్రపతి ప్రారంభించాలి

Bhavani

కరోనా కేసులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలి

Satyam NEWS

Leave a Comment