27.7 C
Hyderabad
May 4, 2024 07: 04 AM
Slider ప్రత్యేకం

పేద జర్నలిస్టులకు ఘోర అవమానం….?

Journalismphoto

ఎన్నికల ముందు జర్నలిస్టులను ప్రభావితం చేసే విధంగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటిస్థలాల జీవో పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే ఏపీలో జర్నలిస్టులకు ఏ మాత్రం మేలు జరగదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే పేద వర్గాల కింద సెంటు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నవారికి, భూమి తీసుకున్న వారికి ఈ స్కీమ్ లో దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో పేద జర్నలిస్టులు మరింత తీవ్రంగా నష్టపోతున్నారు.

మార్కెట్ ధరలో 40 శాతం వరకూ చెల్లించాలంటే అమరావతి ప్రాంతంలో అయితే జర్నలిస్టులు 6 లక్షల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రాంతాన్ని బట్టీ మరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టే వీలు ఏ జర్నలిస్టుకు కూడా ఉండదు.

జర్నలిస్టులకు ఇంటి స్థలాలంటూ జగన్ రెడ్డి సర్కార్ ఓ జీవో జారీ చేసింది. అందులో ఉన్న అర్హతల గురించి తర్వాత.. ముందు అసలు ఆ జీవో చెల్లుతుందా అనే డౌట్ జర్నలిస్టులకు వచ్చింది. ఎందుకంటే అసలు జారీ చేసిన జీవోకు నెంబర్ లేదు. ముందు జీవోకు నెంబర్ ఇస్తే… తర్వాత ఫలానా నెంబర్ జీవో ప్రకారం.. ఇళ్ల స్థలాల కోసం అప్లైచేసుకుంటారని వేడుకుంటున్నారు. కానీ జీవో ఓ సారి.. నెంబర్ ఓ సారి ఇచ్చే విధానం కూడా ప్రభుత్వం ప్రారంభించిందేమో కానీ… జర్నలిస్టులు మాత్రం కామెడీ చేస్తున్నారు.

ఆ జీవో పై తేదీ కూడా లేదు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలంటూ జగన్ రెడ్డి ఇచ్చిన చెల్లని జీవోలో ఉన్న అర్హతలు అచ్చంగా జగన్ రెడ్డి లబ్దిదారుల్ని ఎంపిక చేసే విధంగానే ఉన్నాయి. 98 శాతం మందిని అనర్హుల్ని చేసి… తమకు చెందిన ఓ రెండు శాతం మందికి కొన్ని చోట్ల అప్పనంగా ఇళ్ల స్థలాలు కట్టబెట్టే కుట్రలో భాంగానే ఈ జీవో జారీ అయింది. స్థలం ఉచితంగా కాదు… కనీసం నామినల్ గా కాదు.. నలభై శాతం జర్నలిస్టు కట్టాలి. దీనికోసమైనా జర్నలిస్టు భార్యకుగానీ, జర్నలిస్టుకుగానీ తాను సొంతంగా సంపాదించుకుని లేదా వారసత్వంగా వచ్చిన ఇల్లు ఉన్నా సరే ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలానికి అర్హులు కాదని తేల్చారు..

అంతేనా ఇంకా అక్రిడేషన్లు…. ఇతర రూల్స్ ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనే పని చేయాలన్నారు. ఇలా చెప్పుకుంటూపోతే హామీని నెరవేర్చామని చెప్పుకునేందుకు ఇతర అన్ని పథకాల్లాగే.. జీవోలు జారీ చేసినట్లుగా ఉందని చెబుతున్నారు. అర్హతల పేరుతో ఎవరికీ అర్హతలు లేకుండా చేసింది.. నలుగురు ఐదుగురు తన వారికి ప్రచారం చేసుకుని హామీలు నెరవేర్చామని చెప్పుకోవడం కామన్ అయింది. జర్నలిస్టులకూ ఇది తప్పడం లేదు.

జర్నలిస్ట్ ఇంటి స్థలాలకు సంబంధించిన జి ఓ విడుదల చేసిన ప్రభుత్వం వివరాలు ఇవి:

1. హౌస్ సైట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ అప్లికేషన్‌ను తెరిచిన తేదీ నుండి 45 రోజులలోపు కమిషనర్, I&PRకి దరఖాస్తు చేయాలి.

2. కమీషనర్, I&PR ధృవీకరణకు కారణమవుతుంది మరియు అటువంటి అర్హతగల గుర్తింపు పొందిన జర్నలిస్టుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు అందజేయాలి.

3. అటువంటి అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత, జిల్లా స్థాయి కమిటీలు అటువంటి జర్నలిస్టులకు కేటాయింపు కోసం ఇంటి స్థలాలకు సరిపోయే భూమిని గుర్తిస్తాయి.

4. ప్రస్తుతం గుర్తింపు పొందిన మరియు మీడియాలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్టులు మాత్రమే ఇంటి స్థలాలకు అర్హులు.

5. జర్నలిస్ట్/జర్నలిస్ట్ జీవిత భాగస్వామికి ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇంతకు ముందు ఇంటి స్థలం కేటాయించబడి ఉంటే, వారు ఈ పథకం కింద ఇంటి స్థలం కేటాయింపునకు అనర్హులు.

6. జర్నలిస్టులు ఇప్పటికే తమ పేరు మీద లేదా వారి జీవిత భాగస్వామి పేరు మీద, వారు పనిచేస్తున్న/నివసిస్తున్న స్థలంలో ఇంటి స్థలం/ఫ్లాట్/ఇల్లు మొదలైనవాటిని కలిగి ఉన్నట్లయితే, ఇంటి స్థలం మంజూరు కోసం పరిగణించబడదు.

7. ప్రభుత్వ శాఖలు, PSUS మరియు కార్పొరేషన్‌లలో అక్రిడిటేషన్ కార్డ్‌లను కలిగి ఉన్న ఏ సాధారణ ఉద్యోగి అయినా “జర్నలిస్ట్‌ల హౌసింగ్ స్కీమ్” కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

8. జర్నలిస్ట్ పనిచేస్తున్న/నివసిస్తున్న జిల్లాలోనే ఇంటి స్థలాలను కేటాయించవచ్చు. జర్నలిస్ట్ పనిచేస్తున్న/నివసిస్తున్న మండలంలో కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

9. ప్రతి జర్నలిస్టుకు గరిష్టంగా ఉన్న భూమి 0.03 సెంట్లు మాత్రమే.

10. భూమి ధర 60:40 నిష్పత్తిలో పంచుకోవాలి (ప్రభుత్వం: జర్నలిస్టులు).

11. కేటాయించిన ఇంటి స్థలంలో కేటాయించిన వ్యక్తి  సైట్‌ను అప్పగించిన తేదీ నుండి పది (10) సంవత్సరాల వ్యవధిలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. స్థలాన్ని అప్పగించిన తేదీ నుండి పది (10) సంవత్సరాలలోపు నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే కేటాయింపు రద్దు చేయబడుతుంది.

12. ఇంటి స్థలం కేటాయించి, ఇళ్లు నిర్మించుకున్న జర్నలిస్టులు, ఆ స్థలం భౌతికంగా స్వాధీనం చేసుకున్న పదేళ్ల తర్వాత, ప్రభుత్వానికి తదుపరి సూచన లేకుండానే ఇంటిని పారవేసేందుకు అనుమతి ఉంది.

13. కమీషనర్ I&PR మరియు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమీషనర్ ద్వారా అందించబడిన వెబ్‌సైట్‌లో, లబ్ధిదారుల డేటా భవిష్యత్తులో ప్రయోజనం కోసం ఆధార్‌తో లింక్ చేస్తూ ఆన్‌లైన్‌లో ఉంచబడవచ్చు.

కమిషనర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ & చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ మరియు జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో తదనుగుణంగా తదుపరి చర్యలను తీసుకుంటారు.

Related posts

అక్షర దుప్పటి

Satyam NEWS

విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

మంత్రి ఆగ్రహం: హరితహారంలో ఎండిన మొక్కలు

Satyam NEWS

Leave a Comment