32.2 C
Hyderabad
May 9, 2024 20: 47 PM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులతో అనుబంధం వీడదీయలేనిది: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

#uppalmla

జర్నలిస్టులతో తనకు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయని ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉప్పల్ నియోజకవర్గ సమావేశం నాచారం లోని ఎస్ ఎల్ ఎన్ గార్డెన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు సుభాష్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు సరైన జీతభత్యాలు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ ప్రాంతంలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేకరులతో సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. వారి సంక్షేమం కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. 

జర్నలిస్టులందరికి హెల్త్ స్కీమ్ ను అందించడానికి  సిద్ధంగా ఉన్న విషయమై ఇప్పుడికే హామీ ఇచ్చానని గుర్తు చేశారు. వెంటనే చొరవ తీసుకొని ఆరోగ్య భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉప్పల్ విలేకరులకు కచవాని సింగారం లో ఇచ్చిన పట్టాల కోసం పలు మార్లు మాజీ శాసనసభ్యులు సుదీర్ రెడ్డితో కలిసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన అవసరమైతే మంత్రితో కూడా కలిసి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటానని తెలిపారు. జర్నలిస్టులకు  డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులలో జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కోసమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సరైన న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు.

ఇప్పటిదాకా జర్నలిస్టులకు తాను అండగా ఉన్నానని మునుముందు కూడా ఇదే విధముగా ఉంటానని స్పష్టం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది బాలరాజు లు మాట్లాడుతూ జిల్లాలో యూనియన్ బలోపేతం కోసం నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ, కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి స్థానిక శాసన సభ్యులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కమిటీ అందరికి అందుబాటులో ఉండి  జర్నలిస్టులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కాయ్య, జిల్లా నాయకులు బాలరాజు, అశోక్, శ్రీనివాస్, అక్బర్, జహంగీర్, స్థానిక ప్రెస్ క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులు వెంకట్ రాంరెడ్డి  , రమేష్,  నారోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి

ఉప్పల్ నియోజకవర్గ TUWJ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకోవడం జరిగింది. మల్లాపూర్ ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షునిగా పి.మహేందర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా డి సురేష్, ప్రధాన కార్యదర్శిగా సి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా  రుద్రగోని నర్సింగ్ గౌడ్, రాంప్రసాద శర్మ, పి.శ్రీనివాస్,  కోశాధికారిగా వేముల శంకర్, సంయుక్త కార్యదర్శులుగా రమేష్ యాదవ్, శ్రీధర్ రావు, డి. శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జ. శ్రీనివాస రావు, చుక్క రమేష్, కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, కే.సాంబ, ఏ. విజయ్, సలహదారులుగా కే.చంద్రమౌళి, వి.తిరుపతి రెడ్డిలు ఎన్నికయ్యారు. సమావేశానికి ముఖ్యఅతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే బెతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు జె.ప్రభుదాస్, పి దేవేందర్ రెడ్డి లు  హాజరై నూతన కమిటీని అభినందించారు.

Related posts

పోషకారంతోనే ఆరోగ్యం సిద్ధిస్తుంది

Satyam NEWS

ఈ రాజభవనం ఎవరిదో తెలుసా?

Satyam NEWS

సీతక్కను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాo

Bhavani

Leave a Comment