29.7 C
Hyderabad
May 4, 2024 05: 12 AM
Slider విజయనగరం

విజయనగరం లో  జర్నలిస్టుల పై దాడి హేయమైన చర్య

#journalist

పత్రికలలో ,ఛానల్స్ లలో వచ్చిన వార్తలు ఇబ్బందులు కలిగిన పక్షంలో ఖండించవచ్చని అంతా కానీ భౌతిక దాడులు, బెదిరింపులు సరికాదంటూ విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఎస్పీ లేకపోవడంతో ఏఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కోటేశ్వరరావు, అవనాపు సత్యనారాయణ, ఎం.ఎల్.నాయుడు, శేఖర్, పాత్రో ,రమేష్ నాయుడు, శివ ,ఎం.ఎస్.రాజు ఇతర జర్నలిస్టులు మాట్లాడారు. వివరాల్లోకి వెళితే ఈ నెల 11 వ   తేదీన ఓ పత్రిక లో ఓ పార్టీ కి సంబంధించిన ఒక విశేషణాత్మక కథనాన్ని ప్రచురించడం జరిగింది.

ఆ కథనాలను చూసి తట్టుకోలేని కొంతమంది విజయనగరం కలెక్టరేట్ లో ఉన్న ఆంధ్రప్రభ బ్యూరో బిజిఆర్ పాత్రో పై దౌర్జన్యానికి దిగారు. పాత్రో పై దుర్భాషలాడుతూ, బెదిరించి సెల్ ఫోన్ లాక్కొని అందులో ఫోటోలు చెక్ చేసి ఒక భయానక వాతావరణమే సృష్టించారు. మరొకసారి  మా పార్టీ కి వ్యతిరేకంగా వార్తలు వస్తే చూస్తూ ఊరుకోమని, అంతు చూస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అంతేకాకుండా అలా పాత్రోని బెదిరిస్తున్న ఫోటోలను తీసి, సంబంధిత పార్టీ గ్రూపుల్లో పెట్టి వైరల్ చేశారు. వార్త రాసిన ఆంధ్రప్రభ రిపోర్టర్ పాత్రో కి గట్టిగా వార్నింగ్ ఇచ్చామని, మా వార్నింగ్ తో వణికిపోయాడని గ్రూపులో పెట్టారు. అంతేకాకుండా ఇక పై పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాసినా ఉరుకోవద్దు అని అందరికీ పిలుపునిచ్చారు.

వీరి దౌర్జన్యం వెనుక విజయనగర నియోజకవర్గ ముఖ్య నాయకుల పాత్ర ఉందని మా దృష్టికి వచ్చింది. కావున ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు మరికొద్ది నెలల్లో రాష్ట్రంలో జరిగనున్న ఎన్నికల నేపథ్యంలో జర్నలిస్టులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించి, దాడులకు పాల్పడుతున్న వ్యక్తులపై తమ చర్యలు తీసుకోవాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన జర్నలిస్టులు…. ఏఎస్పీ అస్మా ఫర్హీన్ ను వినతిపత్రం రూపంలో ఫిర్యాదు చేశారు.

Related posts

కొత్తాదేవుడండీ కొంగొత్తా దేవుడండీ: సర్వం కేటీఆర్ మయం

Satyam NEWS

‌ప్రైవేట్ టీచ‌ర్లకు భ‌రోసా కోస‌మే ధీక్ష‌

Sub Editor

లేబర్ కోడ్ రద్దు కోరుతూ రాజంపేట లో సి.ఐ.టి.యు.నిరసన

Satyam NEWS

Leave a Comment