32.7 C
Hyderabad
April 27, 2024 02: 27 AM
Slider ముఖ్యంశాలు

లేబర్ కోడ్ రద్దు కోరుతూ రాజంపేట లో సి.ఐ.టి.యు.నిరసన

#CITU Rajampet

కార్మిక హక్కులను కాలరాసే లేబర్ 4 కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కడప జిల్లా రాజంపేట లో APNGO కార్యాలయంలో గురువారం CITU నేతలు నిరసన వ్యక్తం చేశారు. సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నిరసన తెలిపారు.

నిరసన అనంతరం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించి దేశంలో ఆహార కొరత సృష్టించి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బొగ్గు గనులు, బ్యాంకింగ్ రంగం, విశాఖ ఉక్కు వంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదాయపు పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు 7500 రూపాయలు చొప్పున ఇవ్వాలని అన్నారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు 200 రోజులకు పెంచి పట్టణాల్లో పనులు వెంటనే ప్రారంభించాలని CITU గా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజంపేట పట్టణ కన్వీనర్ నరసింహ చిట్వేల్ రవికుమార్, కేశవ, ధైర్యం తదితర citu నాయకులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లాలో సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు

Satyam NEWS

నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి

Satyam NEWS

కరోనాతో తొలి తెలుగు జర్నలిస్టు మరణం

Satyam NEWS

Leave a Comment