27.7 C
Hyderabad
April 30, 2024 08: 38 AM
Slider సినిమా

మధురపూడి గ్రామం అనే నేను ఫేమ్ శివ కంఠంనేని ‘ఆదిపర్వం’ స్టిల్ ఇది

#adiparva

రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికాఆర్ట్స్- అమెరికాఇండియా(ఎ.ఐ)ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం “ఆదిపర్వం”. మంచులక్ష్మి ముఖ్యపాత్ర పోషిస్తున్న “ఆదిపర్వం” చిత్రానికి బహుముఖ ప్రతిభాశాలి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో ఆమెకు అపోజిట్ గా ఒక పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న శివ కంఠంనేని హీరోగా విడుదల అవుతున్న “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఆదిపర్వం లోని శివ కంఠంనేని ఫస్ట్  లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

“అమ్మోరు – అరుంధతి” చిత్రాల తరహా ఈవిల్ పవర్ అండ్ డివోషనల్ పవర్ మధ్య జరిగే పవర్ ఫుల్ మూవీ ఈ మధ్యకాలంలో రాలేదని చెప్పాలి. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ “ఆదిపర్వం”. గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రంగా మలుస్తున్న ఈచిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న నాగమ్మ పాత్రలో జీవించింది. అలాగే క్షేత్రపాలకుడిగా నటిస్తున్న శివ కంఠంనేని కూడా అద్భుతంగా చేశారు. మంచు లక్ష్మికి శివకంఠంనేనికి మధ్యజరిగే ఒక ఫైట్ కి దాదాపు యాభై లక్షలు ఖర్చుపెట్టామని, ఈ ఫైట్ లో వచ్చే స్పెషల్ ఎఫెక్ట్స్ సినిమాకి హైలెట్ అని” దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు.

ఆదిపర్వంలో క్షేత్రపాలకుడిగా నటించిన శివకంఠంనేని హీరోగా చేసిన  “ మధురపూడి గ్రామం అనే నేను” చిత్రం విడుదల సందర్బంగా ఈ చిత్రం చాలా మంచి విజయాన్ని పొందాలని ఆశిస్తూ విషెస్ చెప్పారు” దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆదిపర్వంలో శివకంఠంనేని నటన ఎంతగానో ఆకట్టుకుంటుందని, “మధురపూడి గ్రామం అనే నేను” సినిమాలో పాత్రని చూసి ఆదిపర్వంలో క్షేత్రపాలకుడుగా శివకంఠంనేని ప్రత్యేక పాత్ర పోషిస్తే బావుంటుందని చెప్పానని, నిజంగా ఆ పాత్రలో శివకంఠంనేని ఒదిగిపోయి చేశారని’  ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు చెప్పారు. 

ఆదిపర్వం చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని ,శ్రీజిత ఘోష్, శివ కంఠంనేని, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి,హ్యారీజోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, బి.ఎన్.శర్మ, యోగి కాత్రి, రవిరెడ్డి, వెంకటరామిరెడ్డి, చీరాల రాజేష్, మధు నంబియార్, బృంద, స్నేహ అజిత్, అయేషా, జ్యోతి, శ్రావణి, గూఢా రామకృష్ణ, రాధాకృష్ణ తేలు, ఆర్కే చిల్లూరి, డీఎస్పీ మొదలగువారు ప్రధాన పాత్రలు పోషించారు.

సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫీ: SN . హరీష్, ఆర్ట్ డైరెక్టర్ : K.VI. రమణ, మ్యూజిక్: మాధవ్ సైబా – ఓపెన్ బనానా ప్రవీణ్ – బి. సుల్తాన్ వలి- లుబెక్ లీ – సంజీవ్, లిరిక్స్: సాగర నారాయణ, రాజాపురం శ్రీనాథరెడ్డి, ఉట్కూరి రంగారావు, రాజ్ కుమార్ సిరా, కె.సి. మల్లికార్జున, ఎడిటర్: పవన్ శేఖర్, ఫైట్స్ : నటరాజ్, కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్, కో డైరెక్టర్ : అక్షయ్ సిరిమల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాస్ రావు, సహనిర్మాత: గోరెంట శ్రావణి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి

Related posts

గ్రౌండ్ లెవెల్: డిగ్రీ కాలేజీ విద్యార్ధులకు వనదర్శిని

Satyam NEWS

మహారాష్ట్రలో జెండా ఎగరవేసిన బీఆర్ యస్

Bhavani

వివిధ కారణాలతో స్వల్పంగా పెరిగిన నేరాల శాతం

Satyam NEWS

Leave a Comment