40.2 C
Hyderabad
April 29, 2024 18: 39 PM
Slider తూర్పుగోదావరి

భువనేశ్వరి ని కలిసిన పార్టీ సీనియర్ నేతలు

#bhuvaneswari

చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరిని పలువురు టీడీపీ సీనియర్ నేతలు గురువారం కలిశారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, కె.ఎస్. జవహర్ భువనేశ్వరిని కలిసిన వారిలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై పార్టీ పరంగా జరుగుతున్న కార్యక్రమాలు ఆమెకు వివరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు తన కుటుంబ సభ్యులతో భువనేశ్వరిని కలిశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ నాయకులతో కలిసి భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ లో జరుగుతున్న నిరసనలను  వివరించారు.

కొమరవోలు వాసుల సంఘీభావం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం నియోజకవర్గాలతో పాటు భువనేశ్వరి దత్తత తీసుకుని అభివృద్ధి చేసిన కొమరవోలు గ్రామస్తులు గురువారం రాజమహేంద్రవరంలో ఆమెను కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో తాము ఎంతో మనోవేధనకు గురయ్యామని, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయాన్ని భువనేశ్వరి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నాయన్నారు. నిత్యం రాష్ట్రం కోసం శ్రమించే చంద్రబాబును జైలు లో పెట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ…తమకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామన్నారు. త్వరలోనే చంద్రబాబు విడుదలై మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వస్తారని భువనేశ్వరి అన్నారు.

Related posts

చెంచు గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

రావ‌ణ‌లంక టీజ‌ర్ విడుద‌ల‌ చేసిన మంత్రి హ‌రీశ్ రావు

Satyam NEWS

Leave a Comment