39.2 C
Hyderabad
May 3, 2024 14: 31 PM
Slider సంపాదకీయం

కొత్తాదేవుడండీ కొంగొత్తా దేవుడండీ: సర్వం కేటీఆర్ మయం

ktr photos

రాష్ట్ర వ్యాప్తంగా కారు గుర్తు ప్రభంజనం వీచడం ఇప్పుడు వార్త కాదు. ప్రతి ఎన్నికలో గెలవడం టిఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయింది. గెలుపు అలవాటు కావడం వల్ల గర్వ తలెత్తరాదని సిఎం కేసీఆర్ తరచూ చెబుతూనే ఉంటారు. ఎవరి సంగతి ఏమో గానీ టీఆర్ఎస్ అభిమానుల ఉత్సాహం ప్రతి ఎన్నికలో పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు.

టిఆర్ఎస్ పార్టీ హవా చూసి ప్రతిపక్షాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సాహసించడం లేదని తాజా మునిసిపల్ ఎన్నికలు మరొక్కమారు నిరూపించాయి. మునిసిపల్ ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయలేదు. కేవలం పార్టీ నాయకులను పిలిచి ఒక మీటింగ్ పెట్టి వారికి ఆ తర్వాత మరో సమావేశంలో పార్టీ బీ ఫారాలు పంపిణీ చేశారు. అంతే మొత్తం బాధ్యత నాది కాదు రామారావుదే అని కేసీఆర్ చెప్పేశారు.

దాంతో మునిసిపల్ ఎన్నికలు మొత్తం కేటీఆర్ చుట్టూనే తిరిగాయి. మునిసిపల్ ఎన్నికల ప్రచార భారం మొత్తం కేటీఆర్ మోశారు. నాయకులను పిలిచి మాట్లాడారు. మిగతా కార్యక్రమాలన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. అఖండ మెజారిటీ వచ్చేసింది. సంపూర్ణ విజయం తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ మొత్తం సందడి సందడిగా మారింది.

ట్రైబల్ నృత్యాల నుంచి అన్ని రకాల విజయోత్సవ సంబురాలు ఏర్పాటు చేశారు. డప్పులు, ఢమరుకాలు మోతలతో తెలంగాణ భవన్ మారు మోగింది. అసలు విషయం ఏమిటంటే ఎక్కడా కేసీఆర్ ఫొటోలు కనిపించలేదు. ఒక్క వ్యక్తి మాత్రం కేసీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని పాలాభిషేకం చేయడం కనిపించింది. అంతే తప్ప అన్నీ కేటీఆర్ ఫొటోలే. ఎక్కడ చూసినా కేటీఆర్ ఫొటోలే కనిపించాయి. రాబోతున్నది కేటీఆర్ శకం అనేదానికి గుర్తుగా.

Related posts

నవంబర్ ఆదాయం 131 కోట్లు

Murali Krishna

వృద్ధులంతా అవినీతిపరులైతే మరి ఈమె సంగతి ఏమిటో…..?

Satyam NEWS

మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదు

Satyam NEWS

Leave a Comment