35.2 C
Hyderabad
April 27, 2024 14: 53 PM
Slider నిజామాబాద్

తప్ప తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

#BJPArmoor

ధాన్యం సేకరణ సమయంలో రైతులను ఇబ్బంది పెడుతున్న విధానంపై బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతుల సమస్యలపై బీజేపీ ఆర్మూర్ మండల శాఖ, పట్టణ శాఖ ఆధ్వర్యంలో MRO కు వినతి పత్రం ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యంగా తాలు, తరుగు పేరు మీద వరి ధాన్యం పై 5 నుండి 6 కిలోల చొప్పున తరుగు తీసేస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు.

వరి ధాన్యం రవాణా, కొనుగోలు కేంద్రాలలో  హమాలీల కొరత సాకుతో రైతుల వద్ద నుండి 16 నుండి 20 రూపాయల వరకు వసూలు చేస్తూ రైతులకు ఇబ్బందులు  కలుగజేస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నూతుల శ్రీనివాస్, ఆర్మూర్ బీజేపీ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఇంకా ఉపాధ్యక్షులు రవిగౌడ్,రాజేందర్, నర్సారెడ్డి,ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు జెస్సు అనిల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేవైయం అధ్యక్షులు నరేష్ చారి, లవణ్ కుమార్, భూమా రెడ్డి, చందు, MPTC లు నవీన్, నర్సయ్య, రాజ్ కుమార్, ఆర్మూర్ బీజేపి పట్టణ కౌన్సిలర్లు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

సీపీఎస్ రద్దుపై మాట తప్పి మడం తిప్పిన సిఎం జగన్

Satyam NEWS

హెల్ప్ లైన్ :తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన డయల్‌ 100

Satyam NEWS

బేతని చర్చ్ లో క్రిస్మస్ కానుకల పంపిణీ

Satyam NEWS

Leave a Comment