Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ నియోజక వర్గ సర్వేలో జూపల్లిదే పైచేయి

#jupallykrishnarao

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో  ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉందని వివిధ రకాలుగా సర్వేలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య లోనే పీకే టీమ్ కూడా సర్వేలు చేస్తున్నట్లు మీడియా ప్రకటన కథనాలతో తెలుస్తుంది. రాష్ట్రంలో ఇలా ఉంటే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీ లో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యేకు పూర్తి వ్యతిరేకత  ఉన్నట్లు  సర్వేలో ఫలితాలు వచ్చాయని విశ్వసనీయ సమాచారం.

అయితే సర్వేలు సీక్రెట్ గా జరుపుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నియోజకవర్గంలో ప్రజాదరణ పెరిగిందని సర్వేలో  వచ్చినట్లు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు జూపల్లి పైన సర్వేలు నిఘా పెట్టాయని తెలుస్తుంది. ఆయన ఏ గ్రామాల్లో ఎక్కడ తిరుగుతున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారనీ విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ తో సహా అన్ని పార్టీల నాయకులకు  60 శాతం వస్తే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్కరికే 40శాతం ప్రజా బలం ఉందని, ప్రజలు ఆయనని కోరుకుంటున్నారని సర్వేలో వచ్చినట్లు సమాచారం.

దీనితో నియోజకవర్గంలో సర్వేలను బట్టి  జూపల్లి దే పై చేయని తెలుస్తుంది. ఇకపోతే సర్వేల ఆధారంగా టీఎర్ఎస్ పార్టీ టికెట్ వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఇస్తుంది అనేది ముందు ముందు చూడాల్సి ఉంది. ఇప్పటికీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికి తెలిసిందే మంత్రిపదవికి  త్యాగం చేసి  ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

ఈ విషయం అందరికి తెలిసిందే 2018 ఓటమి తర్వాత  ఆయన నియోజకవర్గ ప్రజల మధ్యలోనే తిరుగుతున్నారు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి అండగా ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో కొందరు పోలీసులు   పెడుతున్న అక్రమ కేసులు పై ఆయన బాధితుల పక్షాన నిలబడ్డారు. అయితే  ఆయనపై కూడా  కేసులు కావడం గ గమనార్హం. కేవలం రాజకీయంగా కక్ష పూరింతంగా వ్యవహరించారు అనేది ప్రజల్లోకి వెళ్లింది. అయితే ఈ మధ్యలో అయినా పార్టీ మారుతున్నట్లు ప్రకటనలు రావడంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారాని సమాచారం.

ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను నియోజకవర్గ  గ్రామాలలో పర్యటించాలి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి. నియోజకవర్గంలో ఉండాలి  అని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. అందుకే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యే లు నియోజకవర్గంలోకి చేరుకొని పర్యటిస్తున్నారు. అయితే ప్రజా సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఎమ్మెల్యే లది. కానీ ఒకరు ఆదేశిస్తే నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి వచ్చింది.

Related posts

తిరుమల ఆకాశ గంగ సమీపంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam NEWS

Buy Bitcoin Cash BCH with Credit & Debit Card, Bank Account or Apple Pay Online Instantly

Bhavani

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment