39.2 C
Hyderabad
May 4, 2024 19: 28 PM
Slider వరంగల్

వర్గీకరణ తోనే షెడ్యూల్ కులాలకు న్యాయం

#Manda Rajumadiga

షెడ్యూల్ కులాలలో వర్గీకరణ తోనే 59 కులాలకు అన్ని రంగాలలో సమ న్యాయం అమలవుతుందని మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంద రాజుమాదిగ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ ప్రభుత్వ గెస్టు హౌస్ లో మాదిగ ఉద్యోగుల పేడరేషన్ MEF సమావేశం జిల్లా సమన్వయకర్త నెమలి నర్సయ్య మాదిగ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంద రాజుమాదిగ మాట్లాడుతూ మాదిగ ఉద్యోగుల భవిష్యత్తు ఎమ్మార్పీఎస్ పోరాటంతోని సాధ్యమని అన్నారు. ఎస్ సి, ఎస్ టి ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ సాధించిన చరిత్ర మందకృష్ణ మాదిగ కి దక్కిందని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడిన ఘనత కూడా ఆయనదేనని, ఆయన పోరాటంతోనే చట్టం పరిరక్షణ సాధ్యమైందని తెలిపారు.

ఈ నెల చివరి వారంలో కనివిని ఎరుగని రీతిలో మాదిగల విశ్వరూప మహాసభ 30 లక్షల మంది మాదిగలతో జరగబోతుందని అందులో జాతి రుణం తీర్చుకోనికి ప్రతి మాదిగ ఉద్యోగి కుటుంబంతో సహా హాజరై విశ్వరూప మహాసభ లో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మాదిగ, రెవెన్యూ విభాగం ములుగు జిల్లా రెవెన్యూ పిఆర్ డిపార్ట్మెంట్ జిల్లా ఇన్చార్జి బలుగూరు సూరయ్య మాదిగ,

ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ జిల్లా ఇన్చార్జిగా బొమ్మ కంటి వినోద మాదిగ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ములుగు జిల్లా ఇన్చార్జిగా లంజపల్లి రాము మాదిగ వికలాంగుల ఉద్యోగుల జిల్లా ఇన్చార్జిగా బొచ్చు శ్రీనివాస్ మాదిగను నియమించారు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ కరుణాకర్ మాదిగ మండల కన్వీనర్ కనకం దేవదాసు మాదిగ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకుడు డాక్టర్ కోరిక శామీల్ నాయకులు న ద్దునూరి రమేష్ మాదిగ మరాఠీ రవీందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సదాశివ శర్మకు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

Satyam NEWS

నియో cov వైరస్ పై అపోహలు నమ్మవద్దు

Satyam NEWS

విజయవాడ లో దారుణం: రెండు నెలల్లోనే భార్యను చంపిన భర్త

Satyam NEWS

Leave a Comment