29.7 C
Hyderabad
May 1, 2024 04: 10 AM
Slider గుంటూరు

నియో cov వైరస్ పై అపోహలు నమ్మవద్దు

#drsaikumar

రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో నియో cov అనే కొత్త రకం వైరస్ ఆనవాళ్లు (గబ్బిలాలు) జంతువుల్లో గుర్తించారని చైనాలోని ఉహన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట పల్నాడు  రోడ్డు లోని అనన్య హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ మాట్లాడుతూ నియో cov వైరస్ పై గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో పలు యూట్యూబ్ చానెల్లో చాలా భయంకరమైన ప్రచారం జరుగుతోందని ప్రజలు ఎవరూ అపోహలను నమ్మవద్దని తెలిపారు. ప్రస్తుతానికి దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని జంతువుల నుండి జంతువులకు మాత్రమే వ్యాపిస్తోందని డాక్టర్ సింగరాజు సాయికృష్ణ తెలిపారు. ఇది కోవిడ్-19 కొత్త వేరియంట్ కాదని అంతకుముందు 2012, 2015 లొ సౌదీ అరేబియాలో వచ్చిన mers cov జాతికి చెందినదని  ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు ఇప్పుడే ఇది మనుషులకు సోకుతుంది అనే  అంచనాకు రాలేం అంటూ చెప్పారు. దీని మీద ఇంకా పరిశోధనలు జరగాలని అప్పటివరకు ఎవరూ దుష్ప్రచారాలను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Related posts

జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది

Satyam NEWS

జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతాం

Satyam NEWS

షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదు

Satyam NEWS

Leave a Comment