28.7 C
Hyderabad
May 6, 2024 10: 43 AM
Slider విజయనగరం

52 కేసుల‌లో నిందితుడు: విద్య‌ల‌న‌గ‌రంలో జువ‌నైల్ దొంగ‌లు

#vijayanagarampolice

మీరు చ‌దివిందినిజ‌మే…ఒక‌టి కాదు రెండు కాదు…ఏకంగా 52  దొంగ‌త‌నాలు చేసాడు…అయితే కరుడుగ‌ట్టిన,పక్కాగా దొంగ‌త‌నాలు చేయ‌డంలో  దిట్ట అని అనుకోక త‌ప్ప‌దు.అయితే మీరు తొక్క‌లో (పప్పులో) కాలేసీన‌ట్టే. అదేంటి అచ్చు త‌ప్పుగా అనుకోకండి.మీరు చ‌దివింది  నిజ‌మే….!

ఇన్ని దొంగ‌త‌నాలు చేసినది….ఓ జువైన‌ల్. మీరు న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఇది నిజం. సాక్షాత్…అడిష‌న‌ల్ ఎస్పీ అనిల్ పులిపాటి నోటి వెంట వ‌చ్చిందీ ప‌చ్చినిజం. ఇటీవ‌లే  మూడు రోజుల కింద‌ట ఏపీలోని  విద్య‌ల న‌గ‌రం క‌ళ‌ల‌కు కాణాచైన విజ‌య‌న‌గ‌రంలోని పులిగెడ్డ వారి వీధిలో  ఓ  ఇరుకైన చిన్న‌దైన ఇంట్లో  దొంగ‌త‌నం జ‌రిగింది.. బీరావ‌లో ఉన్న 12న్న‌ర తులాల బంగారంపోయింద‌ని బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు  టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు ,ఎస్ఐ సాగ‌ర్ బాబు  ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఆ ద‌ర్యాప్తులో పోలీసులే విస్తుపోయే నిజాల‌తో  నిశ్చేష్టుల‌య్యారు.  కాకినాడ‌కు చెందిన జువైన‌ల్, అలాగే విశాఖ లో ని జైల్లో ప‌రిచ‌య‌మైన మ‌రో జువైన‌ల్  ఇద్ద‌రూ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఈ నెల 19న‌ దొంగ‌తనం చేసారు.బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో  ఉన్న‌తాధికారులు ఆదేశాల‌తో అదీ ఎస్పీ దీపికా  సూచ‌న‌లు, అడిష‌న‌ల్ ఎస్పీ అనిల్  ఆదేశాల‌తో  టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావు స‌మ‌క్షంలో  ఎస్ఐ  సాగ‌ర్ బాబు ఏఎస్ఐ,కానిస్టేబుల్ తో క‌లిసి ….తిండితిప్ప‌లు లేకుండా….అది కొద్దిరోజుల్లోనే జువనైల్  అయిన ఇద్ద‌రు నిందితుల‌నుప‌ట్టుకున్నారు.

ఘ‌ట‌నా స్థ‌లిలో  ఉన్న ఫింగ‌ర్ ప్రింట్స్ ఆధారంగా  టెక్నిక‌ల్  అవిడ‌న్స్ తో..నేరం చేసింది..ఓ జువ‌నైల్ గా  గుర్తించిన పోలీసులు….తీగ ప‌ట్టుకుని ఎట్ట‌కేల‌కు డొంక లాగారు.జ‌ల్సాలే ధ్యేయంగా బాద్య‌త  లేకుండా నిందితులైన జువనైల్స్ ఇద్ద‌రూ ప్ర‌వర్తిస్తున్నార‌ని…పోలీసుల ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

Related posts

జగన్ గారూ, ఉద్యోగుల ఆశీర్వాదం తీసుకోండి…శాపం కాదు

Satyam NEWS

వై ఎస్ ఆర్ కాంగ్రెస్, టిడిపి ఒకే బాట

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

Leave a Comment