38.2 C
Hyderabad
May 5, 2024 22: 02 PM
Slider ప్రత్యేకం

కరోనా పెరుగుతున్నe సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్టు లేదు…!

#vijayashanti

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ అధికమవుతూ ప్రజలు కలవరపడుతోంటే కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపీ మహిళా నేత ఆ పార్టీ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్‌ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయకపోగా… మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం వేశామని, రెండవ డోసు 80 శాతం వేశామని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఎలాంటి ఆంక్షలు అమలు చేయకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టి మరీ సొమ్ము చేసుకుంటున్న కేసీఆర్ సర్కార్ కరోనా నిబంధనలు గాలికొదిలేసిందని విజయశాంతి విమర్శించారు. దీంతో రోజురోజుకి రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు, వారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సైతం కరోనా బారిన పడగా… ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోందని ఆమె తెలిపారు.

ఇటీవల కరోనాపై మన దేశ ప్రధాని మోడీ  అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి సూచనలు చేస్తే… ఆ కాన్ఫరెన్సులో సైతం పాల్గొనలేనంత ముఖ్యమైన పని సీఎం కేసీఆర్‌కి ఏముందో రాష్ట్ర ప్రజలకు తెలపాలని బీజేపీ నేత విజయశాంతి డిమాండ్ చేశారు.

రోజూ లక్షకు పైగా కరోనా టెస్టులు చేయాలని హైకోర్టు ఇటీవల మొట్టి కాయలు వేస్తే… తాజాగా మళ్ళీ జ్వర సర్వే పేరుతో పట్టణ, గ్రామీణ కార్యకర్తలను పరుగులు పెట్టిస్తున్నారని బీజేపీ మహిళా నేత విజయశాంతి అన్నారు. కానీ, కనీసం వారికి రక్షణగా అందుబాటులో ఉంచాల్సిన మాస్కులు, శానిటైజర్లు లేకపోవడంతో  సొంత డబ్బులతో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో 10 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని రెండేండ్ల కిందట అసెంబ్లీలో స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్… వాటి భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రులలో పేదవారికి అందాల్సిన మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పడితే  కాంట్రాక్ట్, ఔట్‌‌ సోర్సింగ్ వ్యవస్థ ఉండదని ప్రగల్బాలు పలికిన  సీఎం కేసీఆర్‌‌‌‌… చివరకు మెడికల్ ప్రొఫెసర్ల భర్తీని కూడా కాంట్రాక్ట్ మయం చేసి, టెంపరరీ నియామకాలకే మొగ్గు చూపడం చూస్తుంటే… ఎంత దిగజారిపోయారో స్పష్టంగా అర్దమవుతోందన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే లెక్కలేని ఈ నిర్లక్ష్యపు సీఎం ని రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం గద్దె దించడం ఖాయమని రాష్ట్ర బీజేపీ మహిళా నేత విజయశాంతి జోస్యం చెప్పారు.

Related posts

అన్ని చోట్లా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు

Satyam NEWS

శభాష్: నిత్యావసరాలు పంచిన సహకార సంఘం

Satyam NEWS

అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment