34.2 C
Hyderabad
May 13, 2024 15: 53 PM
Slider నిజామాబాద్

కాయితిలపై పూటకో మాట గంటకో జిఓ పద్ధతి మానుకోవాలి

కాయితి లంబాడీల విషయంలో పూటకో మాట గంటకో జిఓ పద్ధతి మానుకోవాలని కాయితి లంబాడ రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ అన్నారు. కాయితి లంబాడీల ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1977 లో అప్పటి జిఓ 2,4,5 ప్రకారం తాము ఎస్టీ జాబితాలో ఉన్నామన్నారు. ఎన్నికల సమయంలో 12.03.2008 లో గత సీఎం చంద్రబాబు నాయుడు, 16.05.2008 ప్రజాపథం కార్యక్రమంలో నాటి సీఎం వైఎస్ఆర్ కాయితి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పారని తెలిపారు.

2013 లో నాటి కేంద్ర మంత్రి బలరాం నాయక్ సైతం తమను ఎస్టీ జాబితాలోకి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి లేక పంపారని గుర్తు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ తొలి ప్రసంగంలో కాయితి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేరుస్తున్నట్టు ప్రకటించారని, 2015లో చెల్లప్ప కమిషన్ వేస్తే దారిద్య రేఖకు దిగువన ఉన్నట్టు కమిషన్ ఇచ్చిన సిఫారసు చేసిందన్నారు. 16 ఏప్రిల్ 2017 న చెల్లప్ప కమిషన్ సిఫారసు ప్రకారం 9.8 గిరిజనులు, 0.2 వాల్మీకి బోయ, కాయితిలు ఉన్నారని దాంతో 10 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. తర్వాత 6 సంవత్సరాలు దానిపై ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఆ తర్వాత సుధీర్ కమిటీ తెచ్చిన మైనారిటీ కమిషన్ ఫైల్, ఎస్టీ రిజర్వేషన్ ఫైల్ రెండు ఒకేసారి కేంద్రానికి పంపడం వల్ల తమ ఫైల్ కేంద్రానికి చేరకపోవడంతో తమకు అన్యాయం జరిగిందన్నారు. తర్వాత 10 ఫిబ్రవరి 2023 నాడు మరోసారి అసెంబ్లీ తీర్మానం చేసి 12 నాడు ఆమోదం తెలిపి 28 మార్చ్ నాడు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపిందన్నారు. అసెంబ్లీలో కాలం చెల్లిన తీర్మానాలు తమకు వద్దన్నారు. 1977 లో వచ్చిన 2,4,5 జీఓను సీఎం కేసీఆర్ పరిశీలించాలని, అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు.

కాయితి లంబాడీల ఉన్న ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, ఆదిలాబాద్, నారాయణ్ ఖేడ్, బోథ్, ఖానాపూర్ నిజామాబాద్ రూరల్, నిర్మల్ ఎమ్మెల్యేలు జిఓ 2,4,5 అమలయ్యేలా కృషి చేయాలని, లేకపోతే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. కొందరు కాయితి లంబాడీల డిమాండ్ పై అవగాహన లేకుండా మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారని, అలాంటి వారు జిఓ గురించి తెలుసుకుని మాట్లాడాలని కోరారు. ఈ సమావేశంలో గాంధారి వైస్ ఎంపీపీ భజన్ లాల్, నేరెల్ తండా ఉప సర్పంచ్ నర్సింగ్, దుబ్బ తండా ఉప సర్పంచ్ నానక్ సింగ్, యువ నాయకులు గోపాల్, మేఘరాజ్, సురేందర్, నరేందర్, రమేష్, ప్రకాష్, ఈశ్వర్ పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Satyam NEWS

దళితుడికి శిరోముండనం చేయించిన ఎస్ ఐ అరెస్టు

Satyam NEWS

Leave a Comment