32.2 C
Hyderabad
May 8, 2024 12: 13 PM
Slider నల్గొండ

మండల స్థాయిలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

#kastalashravankumar

కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్పష్టమైన కంటిచూపు అందించాలని,ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ కోరారు.  

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 11వ,వార్డులో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో కస్తాల శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కంటి ఆపరషన్లు అవసరమైన వారికి మండల పరిధిలో కంటి ఆపరేషన్ శిబిరాలను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు మరింత మేలు కలుగుతుందని అన్నారు.

ప్రస్తుతం ఆపరేషన్లు అవసరమైనటువంటి వారు జిల్లా కేంద్ర ఆస్పత్రులకు వెళ్ళవలసి వస్తుంన్నందున వృద్ధులు, పేదవారు మరింత ఇక్కట్ల పాలు కావాల్సి వస్తుందని, ప్రభుత్వం కంటి ఆపరేషన్ అవసరమైనటువంటి వారికి తక్షణం కంటి శస్త్ర చికిత్స శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు,మున్సిపల్ కౌన్సిలర్లు సరిత వీరారెడ్డి,రాజా,విజయ వెంకటేశ్వర్లు, క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ ,డాక్టర్ సుష్మ,మల్లిక, శివ,వార్డు వివిధ పార్టీల నాయకులు, ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి

Satyam NEWS

జస్టిస్ పై జగన్ ఆరోపణల విచారణకు సుప్రీం రెడీ

Satyam NEWS

జాతీయ క్రీడలకు విజయ్ హైస్కూల్ విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment