38.2 C
Hyderabad
May 3, 2024 20: 38 PM
Slider నిజామాబాద్

జాతీయ క్రీడలకు విజయ్ హైస్కూల్ విద్యార్ధులు

#vijayschool

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అసోసియేషన్ వారు నిర్వహించిన అండర్ ఆర్మ్ క్రికెట్ జాతీయ స్థాయి క్రీడలకు ఆర్మూర్ మామిడిపల్లి, విజయ్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు విజయ్ విద్యాసంస్థల అధినేత్రి డా. అమృత లత తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని మొనాలిలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడ ఎంపికలో బాలుర విభాగంలో శివకౌషిక్ (9వ తరగతి) అలాగే బాలికల విభాగంలో మోహన సాయిప్రియ (10వ తరగతి) అంతర్జాతీయ స్థాయికి ఎంపికైయ్యారు. వీరు ఈ నెల నేపాల్ లోని పోకర్ లో 23 నుండి 24 తేదీలవరకు జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయురాలు టి. కవితాదివాకర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మేళకువలు నేర్పిన వ్యాయామ ఉపాధ్యాయులు ధర్మపురిను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరి ఇంఛార్జ్ ఎస్తర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవస్థానం లోఉగాది పర్వదినం

Satyam NEWS

వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

కరోనా చికిత్సలో రెమిడిస్వేర్ ప్రభావం శూన్యం

Satyam NEWS

Leave a Comment