27.7 C
Hyderabad
May 7, 2024 09: 42 AM
Slider కరీంనగర్

రాధికమర్డర్:హత్య స్థలాన్ని పరిశీలించిన కమీషనర్

karimnagar cp visited radhika murder place

కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి శుక్రవారం నాడు రాత్రి సోమవారం నాడు కరీంనగర్‌లోని విద్యానగర్‌ వెంకటేశ్వరకాలనీలో ముత్త రాధిక(17) హత్యకు గురైన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈకేసును అన్నికోణాల్లో విచారిస్తూ వేగవంతంగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.

విద్యార్థిని రాధిక హత్యకు గురైన ప్రదేశంతోపాటు ఇంటి చుట్టుపక్క ప్రాంతాలను సైతం పరిశీలించారు.ఈ కేసు చేధనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు కేసు చేధనకోసం నిరంతరం శ్రమిస్తున్నాయన్నారు.అత్యాధునిక సాంకేతిక నిపుణుల బృందాల సహకారం తీసుకుంటున్నామన చెప్పారు.

అనుమానితులకుసంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని, ఇందులో భాగంగా సిసి కెమెరాల డివిఆర్‌లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నా మని తెలిపారు. ఈ కేసు చేధన కోసం పోలీస్‌శాఖ తీవ్రంగా కృషిచేస్తోందని తెలిపారు.

విద్యార్థిని హత్య సంఘటనను ఉన్మాదపు చర్యగా అభివర్ణించారు.

విద్యార్థిని హత్య సంఘటనను ఉన్మాదపు చర్యగా సిపి పేర్కొన్నారు.ఈ సందర్భంగా హత్యకు గురైన రాధిక కుటుంబసభ్యులతో మాట్లాడారు. నిందితులను పట్టుకున్నఅనంతరం కేసును ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా వేగవంతంగా విచారణ జరుపాలని న్యాయస్థానాన్ని కోరుతామని చెప్పారు. నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

సంఘటన స్థలాన్నిసందర్శించిన వారిలో అడిషనల్‌ డిసిపిలు ఎస్‌ శ్రీనివాస్‌(ఎల్‌అండ్‌ఓ), జి చంద్రమోహన్‌ (పరిపాలన), కరీంనగర్‌ టౌన్‌ ఎసిపి డాక్టర్‌ పి అశోక్‌, సిసిఎస్‌ ఎసిపి శ్రీనివాస్‌, వివిధ విభాగాలకు చెందిన అధికారులు దేవారెడ్డి,ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ ప్రకాష్‌, శశిధర్‌రెడ్డి, రామచందర్‌రావు, కిరణ్‌లతోపాటు పలువురు అధికారులు,ప్రత్యేక బృన్దాలకు చెందిన పోలీసులు ఉన్నారు.

Related posts

కేరళ గవర్నర్ ఛాలెంజ్: వీసీ నియామకాల్లో నా జోక్యం లేదు

Bhavani

పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

ఇక ఆత్మీయ సమ్మేళనాలు

Murali Krishna

Leave a Comment