26.7 C
Hyderabad
April 27, 2024 10: 33 AM
Slider ముఖ్యంశాలు

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

#Bandi Sainjai

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము పూర్తి మద్దతిస్తామని ముందే చెప్పామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గుర్తు చేసారు.

తెలంగాణ రాష్ట్రం తప్ప దేశం లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి స్థాయి..కొన్ని పాక్షిక లాక్ డౌన్ లను ప్రకటించాయన్నారు. ఎట్టకేలకు ఆలస్యంగా నైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందన్నారు.

లాక్ డౌన్ సమయం లో వైద్య సేవలు, పేషేంట్ల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ మాత్రమే కరోనాను కట్టడి చేయగలదని నిరూపణ అయిందని బండి సంజయ్ అన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు.

రాష్ట్రానికి అవసరమున్నంత ఆక్సిజన్, రెమ్ డెసీవర్ ఇంజెక్షన్ లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపించిందని గుర్తు చేసారు.

ఆక్సిజన్, రెమ్ సీసీవర్ ఇంజెక్షన్ల పంపిణీ కోసం ప్రత్యేక నోడల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడా ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలన్నారు.కరోన చికిత్స కు అవసరమైన అన్నీ రకాల మందులను అందుబాటులో ఉంచాలన్నారు.

కరోన పేషేంట్లకు సేవలు అందించడం లో ప్రయివేటు ఆసుపత్రులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. 

వాటి యాజమాన్యాలతో ప్రభుత్వం  చర్చించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలన్నారు.

గతేడాది మొదటి లాక్ డౌన్ లో లాగానే బీజేపీ కార్యకర్తలు లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను ఫాలో అవుతు ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆహారాన్ని అందించాలన్నారు.

తమ తమ బూత్ ఏరియాలో  నిరుపేదలకు అవసరమైన సాయం చేయాలిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.

Related posts

బ్రిటిష్ కాలం నాటి జీఒలను తీసుకొస్తున్న జగన్ ప్రభుత్వం..!

Bhavani

ములుగు జిల్లాలో తొలిమెట్టు పై సమీక్ష

Bhavani

మాస్కులు పంపిణీ చేసిన మణికంఠ ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment