25.2 C
Hyderabad
October 15, 2024 11: 20 AM
Slider కరీంనగర్

లాస్ట్ ఎంక్వయిరీ:రాధిక హత్య ఇంటి దొంగల పనేనా

radhika murder clues team

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోరంటారు అనే నానుడి లాగే ఉంది కరీంనగర్ పోలీస్ ల పరిస్థితి.48 గంటల్లో హంతకుణ్ణి పట్టుకుంటామన్న పోలీసులకు ఈ హత్య కేసులో చుక్కలు కనపడుతున్నాయి.పట్టణం లోని విద్యానగర్ లో సోమవారం జరిగిన ముత్త రాధిక హత్య కేసులో ఇప్పటి వరకు హంతకుణ్ణి పట్టుకోక పోవడం అది నిష్ణాతులైన పోలీస్ల తో కూడిన కరీంనగర్ జిల్లాలో అంటే అందరు ఆచ్చర్య పోతున్నారు.

ముఖ్యం గా ఇద్దరు పేరుమోసిన కమిషనర్ ల నేతృత్వం లో సాగుతున్న ఈ విచారణ లోహత్య జరిగి 72 గంటలు దాటినా, హంతకుడు ఎవరనేది తేల్చలేక పోలీసులు సతమతం అవుతున్నారు.అయితే ఇంటి దొంగను పట్టుకుంటేనే కేసు కొలిక్కి రానుండగా ఇంటి దొంగా కోసం వల వేసి పోలీస్ లు ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు అనుమానితులుగా భావించిన వారిని ఎన్ని రకాలుగా విచారించినా, హత్యకు సంబంధించిన సమాచారం దొరకలేదు. డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ రిపోర్టు, సీసీ కెమెరాల నివేదికలు కూడా పోలీసులకు ఉపయోగపడలేదని సమాచారం.

అమ్మాయి తల్లిదండ్రుల ఫోన్లలోని కాల్‌డేటాతో కూడా ఉపయోగకర సమాచారం లేదని తెలిసింది. రాధికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని, పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. హత్య జరిగిన సంఘటన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారం కాకుండా, అనుకోకుండా జరిగిన హత్యగా స్పష్టమవుతోంది. అదే సమయంలో ఇంటి గురించి, రాధిక ఇంట్లోని వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తి చేసిన హత్యగానే తెలుస్తోంది. కాగా కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి క్లూస్ టీం ని రప్పించి గురువారం ఆధారాలు సేకరించారు.

ఫోరెన్సిక్ సైన్స్ నిపుణుల ఇంద్రాణి ఆధ్వర్యంలో5 గురితో కూడిన బృందం మృతురాలి ఇంటిని సందర్శించి, కీలకమైన ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో అత్యాధునికమైన జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించి కడిగిన రక్తం మరకలు నుండి , 3డి క్రైమ్ సీన్ ఫోటోగ్రఫి వీడియో గ్రఫీ, ఫారో స్కానర్, బాడీ ఫ్లూయిడ్ కిట్ లను ఉపయోగించి, ముఖ్యమైన ఆధారాలు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ లాబ్ కు పంపడం జరిగింది. వాటిని సాధ్యమైనంత తొందరలో విశ్లేషించి నిందితున్ని పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.


మొత్తం 30 మంది ని విచారించిన పోలీస్ లు


కాగా ఇన్వెస్టిగేషన్ లో భాగం గా ఇప్పటి వరకు 30 మందిని విచారించినట్లు తెలుస్తుంది.ఇందులో రాధికా మేన బావ తో పాటు ఇంట్లో కిరాయికి ఉన్న యువకుడు,విద్యుత్ బిల్లు,డిష్ బిల్లుల యువకులతో పాటు ఆమె తో చదివిన కళాశాల విద్యార్థులను పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకైతే ఎలాంటి క్లూ దొరకక పోగా వీరంతా హత్య చేసేంత మనస్వత్వం ఉన్నవారు కాదని తెలుస్తుంది.విద్యానగర్‌లో హత్య జరిగిన గుడి ప్రాంతంలో, ప్రధాన దారిలో ఉన్న పోలీసు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, దుకాణాల్లోని 36 సీసీ కెమెరాలను పరిశీలించారు. సుమారు 100 కాల్స్‌కు సంబంధించి విచారణ జరిపారు. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని, ఇతరులను కలిపి సుమారు 30 మందికి పైగా విచారించారు. ఇంత చేసినాహంతకుడు ఎవరో పోలీసులు కనిపెట్ట లేక పోతున్నారు. కాల్‌డేటా ఆధారంగా జరిపిన విచారణలో కొంతమంది విచారించినప్పుడు కేసు ఛేదనకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి తిరిగిదారులు మూసుకు పోతున్నాయని తెలిసింది.

మరికొంత సమయం పట్టే అవకాశం…

హత్య కేసు చేధించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు చుట్టు పక్కల వాళ్లను విచారించడంతోపాటు రాధిక ఇంట్లోకి వచ్చి, బయటకు వెళ్లే మార్గాలు విషయంలో దృష్టిపెట్టి నిశితంగా పరిశీలిస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయోనని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను విచారించడంతోపాటు రాధిక ఇంటి ప్రాంతంలో అక్కడ పనిచేసిన మున్సిపల్, విద్యుత్‌ వర్కర్ల వేలిముద్రలను కూడా పోల్చిచూసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు.

సమాచారం ఇస్తే నగదు రివార్డు

రాధిక హత్య కేసును చేధించేందుకు ఉపయోగపడే వివరాలు అందించిన వారికి తగిన పారితోషికాన్ని కూడా పోలీసులు ప్రకటించారు. కేసు గురించి ఏవైనా ఆధారాలు తెలిస్తే 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ, ఏసీపీలతోపాటు కమిషనరేట్‌లో డీసీపీలకు కూడా సమాచారం అందించవచ్చని సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన రివార్డు అందజేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.


ఇంటి దొంగల పైనే అనుమానం


హత్య ఘటనలో ఉన్న వాతవరణం చూస్తే కుటుంబం గురించి తెలిసిన వారు, వారికి పరిచయమున్నవారే చేశారనే పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఎవరు చేశారనే విషయం అంతుపట్టడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ హంతకుడెవరూ అన్న విషయాలు తెలియకపోవడంతో నమ్మలేని వ్యక్తులే హంతుకులా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ముఖ్యం గా రాధికా తండ్రిని విచారించాలని పోలీస్ లు ప్రయత్నిస్తున్నారు.కూతురు చనిపోయిన బాధతో పాటు కర్మ కాండలు ఉన్నందున అయన ను విచారణకు పిలిచేందుకు వారు ఎదురుచూస్తున్నారు.ముఖ్యం గా ఈ హత్య దొంగ తననికి ముడిపెట్టడం,ఇంట్లో రక్తం మరకలు కడగడం వంటి సంఘటనలో రాధికా తండ్రి నోరు తెరిస్తే తప్ప హంతకుడు దొరికే అవకాశం లేదు.అందుకే రాధికా హత్య విచారణ ఆమె తండ్రి పైనే ఆధార పడినట్లు తెలుస్తుంది.

Related posts

దళితుల్ని చంపుతున్నారు… మహిళల్ని వాడుకుంటున్నారు

Satyam NEWS

చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండించిన మచిలీపట్నం విద్యార్థులు

Bhavani

అక్టోబర్ 18న వస్తున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్

Satyam NEWS

Leave a Comment