40.2 C
Hyderabad
May 6, 2024 16: 25 PM
Slider కర్నూలు

భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు శివారులోని పంచ లింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీ మొత్తంలో కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. సోమవారము రాత్రి A E S భరత్ నాయక్ ఆధ్వర్యంలో సి ఐ మంజుల, యస్ ఐ ప్రవీణ్ కుమార్ నాయక్, సేబ్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో ఈ మద్యం పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రం రాయచూరు వైపు నుండి ashok leyland దోస్త్ వాహనము కారు (AP 21TX 2143) రాగా, కారును సిబ్బంది ఆపి తనిఖీ చేశారు.

అందులో వెనుక వైపు ట్రోలీ కింది భాగములో ఒక సెపరేట్ ఛాంబర్ లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక అక్రమ మద్యం గుర్తించారు. తనిఖీ చేయగా సీజ్ 36కాటన్ బాక్స్ లు వుండి, వాటిలో 3456 తేట్రా పాకెట్స్ సరఫరా చేస్తున్నట్లు seb అధికారులు గుర్తించారు. నిందితులయిన పరశురామ్, బోయ రాఘవేంద్రను, అక్రమ కర్ణాటక మద్యంను, దోస్త్ వాహనమును సీజ్ చేశారు. వాటిని కర్నూల్ SEB పోలీసు స్టేషన్ లో తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు తిమ్మప్ప, కానిస్టేబుళ్ళు శాంతరాజు, శ్రీనివాసులు, మధు పాల్గొన్నారు.

Related posts

కాట్రగడ్డ ప్రసూన వైపు కార్యకర్తల మొగ్గు

Satyam NEWS

ఏం అమ్మా..ఖ‌తార్ ఏర్ వేస్ బాగుందా…

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment