38.2 C
Hyderabad
May 5, 2024 22: 31 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో కార్తీకమాస పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలసిన ఆదిశిలా క్షేత్ర శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాలయంలో కార్తీకమాస ప్రత్యేక పూజలు, దీపోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయం వ్యవస్థాపక వంశీ యులు శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. ఆదిశేలాక్షేత్రం హరిహరాదుల పవిత్ర పుణ్యక్షేత్రం. శ్రీహరి అవతరించడానికి ఈశ్వరుడు తపమాచరించిన పుణ్యస్థలం. కార్తీక మాసం ప్రారంభం నుండి దేవాలయంలో నిత్యం దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఈనెల 9 నుండి ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకం, సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈనెల 15న తంబిహళ్లి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సింధు మాధవ తీర్థులు మూడు రోజులపాటు దేవాలయంలో ఉండి ప్రత్యేక పూజలు, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఈనెల 23, 24 తేదీలలో శ్రీ విద్యారణ్య భారతి తీర్థ స్వామి దేవాలయానికి విచ్చేసి పూజలు సంస్థాన పూజలు నిర్వహిస్తారని తెలిపారు.ఈనెల 28 వరకు ఉదయం శ్రీనివాసుని పంచామృతాభిషేకం, శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, గోపూజ, శ్రీ మూల రాముల పూజ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సర్వసేవ చేయించేవారు రూ.3వెలు, దీపోత్సవ కార్యక్రమం నిర్వహించేవారు రూ.1000 చెల్లించి స్వామి సేవలో తరించాలని కోరారు. ఈనెల 28 నుండి శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు.

Related posts

500 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదు

Satyam NEWS

వాట్సాప్ ద్వారా ఫోరం ఫర్ నీట్ 10 గ్రాండ్ టెస్ట్స్,కీ

Satyam NEWS

దాయాదులపై వైసీపీ నేతల దాష్టీకం

Bhavani

Leave a Comment