30.3 C
Hyderabad
March 15, 2025 10: 19 AM
Slider ముఖ్యంశాలు

షార్ప్ ఎడ్జి: బిజెపిలో చేరబోతున్న కత్తి మహేష్

katti mahesh

వివాదాస్పద సినీ విమర్శకుడు, రాజకీయ నాయకుడు కత్తి మహేష్ రాజకీయంగా త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇక నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని అనుకున్న కత్తి మహేష్ త్వరలో బిజెపి లో చేరబోతున్నట్లు చెబుతున్నారు.

కత్తి మహేష్ నిర్ణయం వల్ల బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రధాన ఎజెండాగా మార్చేందుకు బిజెపికి కొత్త అస్త్రం దొరికినట్లు అవుతుంది. కులాల కుమ్ములాటగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దిశ మార్చేందుకు నడుం కట్టిన బిజెపి ఇప్పటికే జనసేనతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలోనే అట్టడుగు వర్గాలకు సంబంధించిన నాయకులను కూడా చేర్చుకోవడం ద్వారా సమాజంలో మంచి సందేశాన్ని పంపించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి కత్తి మహేష్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది.

అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో వ్యక్తిగతంగా కత్తి మహేష్ కు విభేదాలు ఉన్నాయి. ఇప్పటికే జనసేన బిజెపి కలిసి పని చేస్తున్నందున బిజెపి కత్తి మహేష్ విషయంలో ఆలోచించి అడుగు వేస్తున్నది. అన్నీ సక్రమంగా జరిగితే బహుశ కొద్ది రోజుల్లోనే కత్తి మహేస్ బిజెపి కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Related posts

భ‌క్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం

mamatha

కాంగ్రెస్ పై పువ్వాడ ఫైర్

mamatha

మేము సైతం అంటూ పోటీలకు సిద్ధపడ్డ భవాని,శ్రీజ

Satyam NEWS

Leave a Comment