28.7 C
Hyderabad
April 26, 2024 09: 36 AM
Slider తెలంగాణ

మీడియా క్రియేషన్ : నేనా సి.ఎమ్మా ఎపుడు ఏకడా

media creation

త్వరలోనే నేను సీఎం అవుతాననేది మీ కల్పితమే వాస్తవం కాదు.నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టడం గురించి మీ మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారు అంటూ మీడియావాళ్లపైనే తోసేశారు రాష్ట్ర మంత్రి ,టీఆరెస్ అధ్యక్షులు కేటీఆర్ .త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సీఎం అవుతారు’ అని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ దీనిపై కేటీఆర్ స్పందించారు. ‘

తానే ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానని మీడియాకు చెప్పలేదని ఆయన అన్నారు.కాగా, మునిసిపల్ ఎన్నికల్లో తాము భారీ మెజారిటీ తో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ పైకి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.

కాగా తానూ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదని సీఎం కేసీఆర్ సమర్థవంతం గా తన పని తానూ చేసుకుంటుండగా ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదని ఆయన అన్నారు.

Related posts

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పై అసత్యపు ఆరోపణలు సరికాదు

Satyam NEWS

బంగారం కోసం ఘాతుకం…! బంధువే హంతకుడు…!

Satyam NEWS

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.4.86కోట్ల విలువైన బంగారం పట్టివేత

Satyam NEWS

Leave a Comment