26.7 C
Hyderabad
May 16, 2024 09: 49 AM
Slider కవి ప్రపంచం

వెలుగు పువ్వులు

#Purimalla Sunanda New

చీకట్లను కవ్వించే వెలుగు పువ్వులు

ఆకాశం నుండి రాలిన తారల నవ్వులు

ఇంటింటా పంచుతున్న ఆనందాల పరిమళాలు!

బతుకు పోరాటంలో

సాధించిన విజయాలకు ప్రతీకలై

గుండెల్లో విరబూసిన

సునందన వనాలు!

చెలియలి కట్ట దాటిన సహనం

చెడుపై చేసిన యుద్ధం

వేదనలను అధిగమించి

జీవిత రహదారిలో

ఎదురైన కర్కశ కంటకాలను ఏరేస్తూ..,.

పరుచుకున్న పచ్చదనపు మొక్కలకు పూచిన  వెలుగు పూలు

చూపించే దారి దీప కాంతులు!

విశ్వమానవ కళ్యాణానికి

ఆలపించిన సమైక్యతా రాగంతో

ఇస్తున్న చైతన్య సందేశాలు

ఇదే కదా దీపావళి పండుగ ఆశ్వయుజ మాస

అమావాస్య లో పూయించిన వెన్నెల పూల వేడుక

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

గో గ్రీన్: నటులు, నిర్మాతల గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

Say no to Drugs: తాడేపల్లిలో తెలుగు యువత ప్రదర్శన

Bhavani

లాలూ ప్రసాద్ యాదవ్ భగవద్గీత చదివితే అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది

Satyam NEWS

Leave a Comment