Slider ప్రత్యేకం

ఎస్పీ ముందే రాజీనామా చేస్తాన‌ని ఎమ్మెల్యే స‌వాల్…

#mlakolagatla

విజ‌య‌న‌గ‌రం  జిల్లా ఎస్పీగా చార్జ్ తీసు్కున్న దీపికా ..తొలిసారిగా విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రమైన  విజ‌య‌న‌గ‌రం ట్రాఫిక్ క్ర‌మ‌బద్దీక‌ర‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికేన‌గ‌రంలోప‌లుమార్లు ప‌ర్య‌టించి…ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలోఆ విభాగపు డీఎస్పీ మోహ‌న్ రావు  నుంచీ  అవ‌స‌ర‌మైన సూచ‌న‌లు తీసుకున్న ఎస్పీ..తాజాగా.. స్టేక్ హోల్డ‌ర్స్, ఆర్టీసీ, ఛాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ ,మున్సిపాలిటీ,ఆర్ అండ్ బీ అధికారుల‌తో డీపీఓలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశానికి ఎంఎల్ ఏ కోల‌గ‌ట్ల‌వీర‌భ‌ద్రస్వామి, మేయ‌ర్  విజ‌య‌ల‌క్ష్మీ, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావ‌ణిల‌తో పాటు డీఎస్పీ అనిల్, మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ వ‌ర్మ‌, ఆర్టీసీ డీఎం బాపిరాజు, స్టేష‌న్ మేనేజ‌ర్ శ్రీనివాస‌రాజు ,సీఐలు ముర‌ళీ, మంగ‌వేణి,ల‌క్ష్మ‌ణ‌రావు,  ట్రాపిక్ ఎస్ఐలు భాస్క‌ర‌రావు,దామోద‌ర‌రావు, ఏఎస్ఐ ఆదిత్య‌,ల‌తో పాటు ప‌లువురు వ్యాపార‌స్తులు,రోట‌రీ క్ల‌బ్  ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ డీఎం బాపిరాజు, ఆర్ అండ్  బీ ఈఈ ,త‌దిత‌రులు ట్రాఫిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌లపై మాట్లాడారు.అనంత‌రం ఎమ్మెల్యే కోల‌గట్ల మాట్లాడుతూ…పీడ‌బ్య్లూ మార్కెట్ దారుణంగా అయ్యేందుకు కార‌ణం….స్థానిక వ్యాపార‌స్తులేన‌ని…త‌మ షాపు ముందున్న చిన్న కోట్ల‌ను..తీయించ‌గ‌లిగితే తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.పోలీసులు ట్రాఫిక్  స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ముందుకు వ‌చ్చిన‌ప్పుడు త‌మ వంతు స‌హాయ  స‌హ‌కారాల‌ను అందించాల‌న్నారు.

Related posts

అత్యంత వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం

Satyam NEWS

సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారు

Satyam NEWS

అన్ని పనులు డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment