38.2 C
Hyderabad
May 3, 2024 20: 38 PM
Slider కవి ప్రపంచం

చెప్పరా….

#K.Haranath New Photo

ఈ రోజు స్వేచ్ఛా

స్వాతంత్య్ర దినం

నా శ్వాసలో శ్వాసయై

నా అక్షరంలో అక్షరమై

నా సాహితీ గవాక్షానికి

దారులు ఏర్పరచిందెవరో తెలుసా?

నా మనసు పొరల్లో

భావ కవితాప్రేమాగ్ని

జ్వాలలు రగిల్చిందెవరో తెలుసా?

నా గుండెలపై అనునిత్యం

సవారి చేస్తూ నను కవ్విస్తూ

లాలిస్తున్నదెవరో తెలుసా?

నా కవిత్వ దాహాన్ని తీరుస్తూ

ప్రతి క్షణం, ప్రతి నిమిషం

ప్రతి శుభోదయం

నా హృదిన మల్లెల

సుమ కవితా సౌరభాల్ని

చల్లుతున్నదెవరో తెలుసా?

నా కవితాక్షర తోరణాలకు

అభినందన మాలలల్లుతున్న

మనసున్న మారాణి ఎవరో తెలుసా

నా కలానికి భావ కవితా పారాణి రాస్తూ

పదముల ముద్రలు వేస్తున్న

నా రాణి రేరాణి ఎవరో

మీకు తెలుసా?

ఈ ప్రశ్నకు సమాధానం

కోసమే చెకోరిలా నిరీక్షిస్తున్న

ఒక కవి హృదయం.

ఈ రోజు స్వేచ్ఛా స్వాతంత్య్ర దినం

తెలిస్తే ఎవరైనా చెప్పరా?

నా శ్వాసలో శ్వాసయై

నా అక్షరంలో అక్షరమై

నా సాహితీ గవాక్షానికి

దారులు ఏర్పరచిందెవరో తెలిస్తే చెప్పరా

మరొక్క సారి మనసుతో

అడుగుతున్నా చెప్పరా? చెప్పరా?

కె.హరనాథ్, సెల్ నెం:9703542598

Related posts

అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు

Satyam NEWS

మోడీ అమిత్ షాల సెంటిమెంట్లను ఊడ్చేసిన చీపురు

Satyam NEWS

విశాఖ డైరీ చైర్మన్ ఆడారి మృతి

Bhavani

Leave a Comment