37.2 C
Hyderabad
May 6, 2024 14: 38 PM
Slider సంపాదకీయం

మోడీ అమిత్ షాల సెంటిమెంట్లను ఊడ్చేసిన చీపురు

aravind kejrival 11

అరవింద్ కేజ్రీవాల్ బిజెపి పరువు తీయడమే కాదు బిజెపి నుంచి హిందూత్వ స్లోగన్ ను కూడా లాగేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్టు అని బిజెపి నాయకులు విచ్చలవిడిగా చేసిన ఆరోపణలకు ఆయన వందేమాతరం స్లోగన్ తో సమాధానం చెప్పారు.

పాకిస్తాన్ మాటలు అరవింద్ కేజ్రీవాల్ నోటి నుంచి వస్తున్నాయని చెప్పిన బిజెపికి సమాధానంగా ఆయన భారత్ మాతాకీ జై నినాదాలు చేస్తున్నారు. బిజెపి వాళ్లంతా రామ భక్తులైనట్లు మిగిలిన వారంతా హిందూత్వానికి శత్రువులైనట్లు బిజెపి చేసిన ప్రసంగాలకు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా తో సమాధానం చెప్పారు.

మోడీ అమిషా ద్వయానికి చుక్కలు చూపించిన ఒకే ఒక్కడు అరవింద్ కేజ్రీవాల్. గత ఎన్నికలలో 67 స్థానాలు గెలిచిన అరవింద్ కేజ్రీవాల్ ఈ సారి 63 స్థానాలు గెలిచాడు (కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు). ఇది మామూలు విజయం కాదు. అసాధారణ విజయం. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు దేశం మొత్తానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. అభివృద్ధికి ప్రజలు ఓటేస్తారని ఢిల్లీ ప్రజలు నిరూపించారు.

జాతీయ రాజకీయాల పేరు చెప్పి ఓట్లు వేయించుకుందామని చూసిన బిజెపికి తాము తమ పని చేసేవారికే వేస్తామని ఢిల్లీ ఓటర్లు తీర్పు చెప్పారు. దేశ భక్తి, మత మౌఢ్యానికి తాము తలొగ్గమని తేల్చి చెప్పారు. ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఓటు వేస్తామని ఢిల్లీ ప్రజలు చెప్పిన ఈ మాటలు దేశం మొత్తం వినాలి. దేశం మొత్తం ఆచరించాలి. కార్యశీలతకు ఓటు అనే నినాదం దేశం మొత్తం వ్యాప్తి చెందితే దేశంలో ధన రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు నాశనం అవుతాయి.

పని చేసిన ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించే ఆనవాయితీ దేశంలో కొనసాగాలి. ఓటకు వెయ్యో రెండు వేలో తీసుకుని ఓటు వేసే పద్ధతి మారాలి. అవినీతి పరులు, నేరస్తులు పోటీ చేసి డబ్బులు ఖర్చు చేసి గెలిచే సంస్కృతి దేశం నుంచి పోవాలి. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులతో ఓట్లు కొనుక్కునే వారికి ఢిల్లీ ఎన్నిక కనువిప్పు కావాలి. పోవాలి ఈ చెత్తా చెదారం. అరవింద్ కేజ్రీవాల్ కు అధికారాలు లేకుండా చేయడానికి బిజెపి అన్ని ప్రయత్నాలు చేసింది.

మొండిగా పోరాడిన కేజ్రీవాల్ గెలుస్తూనే ఉన్నారు. అంతిమంగా ప్రజలు కూడా గెలిపించారు. హిందూత్వ నినాదం మోడీ, అమిత్ షాల సొంతం కాదు. దేశ భక్తి కేవలం అమిత్ షా మోడీలకే ఉంటుందని మిగిలిన వారికి ఎవరికి దేశభక్తి ఉండదని భ్రమ కల్పించడం కూడా మంచిది కాదని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

లోక్ సభ ఎన్నికలలో రెండో సారి విజయం సాధించిన బిజెపికి ఆ ఆనందం లేకుండా చేశాడు అరవింద్ కేజ్రీవాల్. తొలి సారి మోడీ గెలిచినప్పుడు కూడా ఇలానే చేశాడు. ఇప్పుడూ అదే రిపీట్ చేశాడు.  అరవింద్ కేజ్రీవాల్ అందరిలాంటి నాయకుడు కాదని ఈ ఎన్నిక నిరూపించింది.

Related posts

విదేశీ మద్యం బ్రాండ్లను అక్రమంగా తయారుచేసే దంపతుల అరెస్టు

Satyam NEWS

రెండు రోజుల పాటు భారీ వర్షాలు

Satyam NEWS

జగన్ గారూ మొహమాటం వద్దు ఆర్ టీ జీ ఎస్ వినియోగించుకోండి

Satyam NEWS

Leave a Comment