29.7 C
Hyderabad
May 4, 2024 03: 09 AM
కవి ప్రపంచం

తొలి జల్లు పలకరింపు

#m anasuya

గ్రీష్మములో బీడువారి

చిరుగుల చీర కట్టిన ధరణి

తొలిజల్లు పలకరింపుతో

తడిసి ముద్దై

పారవశ్యమునొందిన ధరణి

పచ్చని పట్టుకీర కట్టి

కొత్త పెళ్లికూతురిలా సిగ్గుల

మొగ్గై ఒళ్లువిరుస్తూ

ఆనందహేలలో ఓలలాడుతుండగా

ధరణి అందాలను తనివితీర

చూడాలని రవి తహతహలాడుతుండగా

వాయునందనుడు చల్లగా స్పర్శిస్తుండగా

ఆ…. మధురతన్మయంలో పులకరిస్తుండగా

పక్షుల కువకువలు, పిల్లగాలుల సవ్వడులు

ఏకమైన గిలిగింతలు పెడుతుండగా

ఈ …. మధురాతిమధురాలు నావేకదా అని

తొలిజల్లు మరింత హుషారై

ధరణి ని అణువణువును

తన తుషారంలో తడుపుతుండగా

ప్రకృతి పట్టరాని ఆనందంలో తడిసి ముద్దవుతూ

తొలిజల్లు చినుకుల ముత్యాలను ఏరుకుంటూ

మైమరచిపోతున్న ప్రకృతిలో

నన్ను నేను మరువనా

ఎం.అనసూయ, జిపిఎస్ సరళాదేవి హట్స్, సైదాబాద్, హైదరాబాద్

Related posts

గాదిలి ఉగాది

Satyam NEWS

నువ్వొస్తావనీ…!

Satyam NEWS

ఆధునిక చాణక్యుడు

Satyam NEWS

Leave a Comment