31.7 C
Hyderabad
May 7, 2024 02: 02 AM
Slider రంగారెడ్డి

75ఏళ్లలో ఎవరూ చేయలేని పని  8ఏళ్లలో చేసిన కేసీఆర్

#gangula

చిట్యాల ఐల‌మ్మ కేవ‌లం ఒక కులానికి మాత్ర‌మే కాద‌ని యావ‌త్ తెలంగాణ జాతీ ఆస్థి అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. ఈరోజు ర‌వీంద్ర‌భార‌తిలో ప్ర‌భ‌త్వ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించిన చిట్యాల ఐల‌మ్మ 127వ జ‌యంతి వేడుక‌ల్లో స‌హ‌చ‌ర మంత్రి త‌ల‌సాని, ఎమ్మెల్సీ బ‌స్వ‌రాజు సారయ్య ఇత‌ర ఉన్న‌తాధికారులు, బీసీ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌యంతి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ ఐల‌మ్మ స్పూర్తితోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ పోరాటం సాగించార‌న్నారు. నాడు తీవ్ర వివ‌క్ష‌ను ఎదిరించి ఆత్మ‌గౌర‌వం కోసం నిజాంకు వ్య‌తిరేకంగా బందూకును చేత‌ప‌ట్టి సాయుద పోరాటం చేసింద‌ని, వెట్టిచాకిరి, వివ‌క్ష‌త‌ల‌ను తెలంగాణ నుండి పార‌ద్రోలేందుకు చిట్యాల ఐల‌మ్మ పోరాటం దోహదం చేసింద‌న్నారు మంత్రి గంగుల‌. ఎక్క‌డైతే ఐల‌మ్మ చావు కోసం రివార్డు ప్ర‌క‌టించారో అదే తెలంగాణ నేల‌పై ఈరోజు అధికారికంగా 127వ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించుకోవ‌డం తెలంగాణ‌లో మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు.

సీఎం కేసీఆర్ పేర్కొన్న‌ట్టుగా చిట్యాల ఐల‌మ్మ తెలంగాణ త‌ల్లి అని, అదే స్పూర్తితో ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. నాటి పాల‌కుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల వెనుక‌కునెట్టేయ‌బ‌డ్డ బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు సీఎం కేసీఆర్ నేత్రుత్వంలో ఆత్మ‌గౌర‌వం వెల్లివిరుస్తుంద‌న్నారు. నాడు 19 గురుకులాలు 7500 మంది విధ్యార్థులుంటే నేడు 310 గురుకులాలు 1,65,400 మంది విధ్యార్థుల‌కు ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో విద్య‌న‌బ్య‌సిస్తున్నార‌న్నారు. కుల‌వ్రుత్తిలు చేసుకొనే ప్ర‌తీ త‌ల్లిదండ్రీ త‌మ బిడ్డ‌ల్ని ఇంగ్లీష్ మీడియంలో చ‌దివిస్తూ గ‌ర్వంగా జీవిస్తున్నార‌న్నారు,

కులవృత్తులు చేసుకునే వారికి సైతం తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఏ ఒక్కరు అడగకుండానే రజకులకు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత కరెంటు అందించారని దాదాపు లక్ష కుటుంబాలు దీని నుండి లబ్ధి పొందుతున్నారన్నారు. హైదరాబాదులోనే  విలువైన ప్రాంతం మేడిపల్లిలో రెండు ఎకరాలు ఐదు కోట్లను కేటాయించారన్నారు. సంచార జాతులు సహా యావత్ బీసీ కులాలకు వేల కోట్ల విలువైన 87 ఎకరాలు 95 కోట్లను కేటాయించారు అన్నారు. ఆర్థిక సహాయ పథకాలతో పాటు కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాన్ని బీసీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారి అన్నారు మంత్రి గంగుల. ఇంత చూస్తున్న ముఖ్యమంత్రి కి బడుగు బలహీనవర్గాల ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యావత్ వెనుకబడిన వర్గాలంతా సంఘటితంగా ఉండాలని విచ్ఛిన్నకర శక్తుల దురాగతాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ గారికి తెలంగాణ ఎట్లా ఉండాలి అని విజన్ ఉందని, దానికోసమే ఆయన నిరంతరం పనిచేస్తారని, అది పట్టని మతోన్మాద శక్తులు కుక్కల్లా మొరుగుతాయన్నారు. ఎన్నో సంక్షేమ పథకాన్ని అందిస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రభాగంలో ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అందరూ అండగా ఉండాలన్నారు

ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ కెసిఆర్ ని ఏ ఒక్కరు అడగకుండానే 250 యూనిట్ల ఉచిత కరెంటు, బీసీ కులాల ఆత్మగౌరభవనాలను కేటాయించారని, రజకులను గౌరవించడంలో ఆయనకు మరెవరు సాటిరారన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన చేయలేని పనుల్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో నేటి మంత్రి గంగుల కమలాకర్ దిగ్విజయంగా చేస్తున్నారని కొనియాడారు.

బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ వివిధ దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల్ని సమగ్రంగా అధ్యయనం చేశామని వాటన్నింటికన్నా తెలంగాణ ఎంతో అద్భుతంగా పురోగమిస్తుందన్నారు. చరిత్రని ఘనంగా స్మరించుకుంటూ నేడు జరుగుతున్న కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసే దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రజక సంఘాలు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఐలమ్మ జయంతి వేడుకల కమిటీ చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

Satyam NEWS

మ‌రొక సీనియర్ రిపోర్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌: యాడ్స్‌, స‌ర్క్యూలేష‌న్ కోసం ఒత్తిడే కార‌ణం

Satyam NEWS

కొల్లాపూర్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

Satyam NEWS

Leave a Comment