40.2 C
Hyderabad
April 26, 2024 11: 30 AM
Slider సంపాదకీయం

Counter attack: లక్ష్మీపార్వతి పాచిక పారేనా?

#cmjagan

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలను కౌంటర్ చేసేందుకు అధికార వైసీపీ నానా తంటాలు పడుతున్నది. ఎన్టీఆర్ పేరు తీసేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం అయిన నేపథ్యంలో ఆ పార్టీ సోషల్ మీడియా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టింది. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే అర్హతే లేదనే వాదనతో పలు రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగించారు.

ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు చంద్రబాబునాయుడి గురించి ఇలా అన్నారు అలా అన్నారు అంటూ పాత క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో గుప్పిస్తున్నారు. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్ టీ ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డిని ఒకే స్థాయి నాయకులు అనే రీతిలో ట్వీట్ చేయడంతో ఒక్క సారిగా ఆయన అభిమానులే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు.

ఈ పరిస్థితినే వైసీపీ కోరుకున్నందున కొంత మేరకు వారికి సంతోషం కలిగింది. వాస్తవానికి ఎన్టీఆర్ పేరు మార్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ పార్టీలోని వారే లోలోన తీవ్ర వ్యతిరేకత ప్రకటించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన నిర్ణయం ఇదేనని కూడా పార్టీ వర్గాలు భావించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత కార్పొరేషన్ పదవి పొందిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎన్టీఆర్ పేరు మార్పునకు వ్యతిరేకంగా పదవికి రాజీనామా చేశారు.

దీంతో పార్టీ ప్రతిష్ట మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరింత ప్రచారం ఎక్కువ చేశారు. పేరు మార్చిన నాలుగు రోజులకు అత్యంత పరుష పదజాలంతో నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేయడంతో తెలుగుదేశం పార్టీలో మరింత ఉత్సాహం తొంగిచూసింది. బాలకృష్ణ పరోక్షంగా మాజీ మంత్రి కొడాలి నానిని, ఎమ్మెల్యే వల్లభనేని వంశిని, తెలుగుదేశం లో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత వైసీపీకి వలసవెళ్లి అక్కడ పెద్ద పెద్ద పదవులు పొందిన వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని అందరూ భావించారు.

ఇది వైసీపీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఎన్టీఆర్ పేరు మార్పునకు ఎక్కడ నుంచి కూడా ఎలాంటి అనుకూల ప్రతిస్పందన రాకపోవడంతో చివరగా లక్ష్మీపార్వతిని రంగంలో దించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన ఐదు రోజుల తర్వాత స్పందించిన లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు. ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టినందున అతి చిన్నదైన యూనివర్సిటీకి పేరు తీసేయడంలో ఎలాంటి తప్పు లేదని లక్ష్మీపార్వతి అన్నారు.

ఎన్టీఆర్ పేరును విజయవాడకు పెట్టడంపై వైసీపీకి అనుకూలంగా పెద్దగా స్పందన రాలేదు కానీ యూనివర్సిటీకి పేరు తీసేయడంపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి తన అభిప్రాయాన్ని చెప్పడం గమనార్హం. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టడం పెద్ద విషయమని, వైద్య యూనివర్సిటీకి తీసేయడం చిన్న విషయమని ఆమె అనడంపై తెలుగుదేశం అభిమానులు భగ్గుమన్నారు.

లక్ష్మీపార్వతి ప్రకటన తమకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టిస్తుందని భావించిన వైసీపీ వారికి ఈ ప్రతిస్పందనతో తీవ్ర నిరాశ కలిగింది. లక్ష్మీపార్వతి నేడు మీడియా సమావేశం నిర్వహించి ముందుగా ఈ విషయం చెప్పకుండా చంద్రబాబును విమర్శించడంపైనే దృష్టి సారించారు. ఈ కారణం వల్ల కూడా ప్రతిస్పందన బాగా తక్కువగా ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

పాత విషయాలు చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ కుమార్తెలు ఇద్దరిని తీవ్రంగా విమర్శించడంతో లక్ష్మీపార్వతి సమర్థనకు విలువ లేకుండా పోయిందని కూడా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించడంతో లక్ష్మీపార్వతి అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోయారని కూడా వైసీపీకి చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్లిష్ట పరిస్థితిలో ఉన్న వైసీపీని గట్టెక్కించడానికి కాకుండా కేవలం తన పాత కక్షలు తీర్చుకోవడానికే లక్ష్మీపార్వతి ప్రాముఖ్యతనిచ్చిందున తమ పార్టీకి రావాల్సిన రాజకీయ ప్రయోజనం దక్కలేదని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మీపార్వతి తన మనోగతాన్ని చెప్పడమైనే శ్రద్ధ చూపారని, ప్రస్తుత పరిస్థితిని విలేకరి ఒకరు అడిగితే తప్ప చెప్పలేదని, దీనివల్ల కూడా తమకు ఆశించిన ఫలితం రాలేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు.  

Related posts

అసైన్డ్‌, లంక భూముల రైతుల‌కు పూర్తి హక్కులు

Satyam NEWS

మరో 7 పిటీషన్లు దాఖలు చేసిన రాజధాని రైతులు

Satyam NEWS

స్నోతుఫాన్ :బెలూచిస్తాన్ లోమంచువర్షం 31మంది మృతి

Satyam NEWS

Leave a Comment