28.7 C
Hyderabad
April 27, 2024 06: 14 AM
Slider ప్రపంచం

అమెరికా పాక్ సంబంధాలపై జైశంకర్ తీవ్ర వ్యాఖ్య

#jaishankar

పాకిస్తాన్ అమెరికా సత్ సంబంధాలు ఇరు దేశాలకూ ఉపయోగపడే అవకాశం లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఆయన అమెరికాలోనే పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సోమవారం ఆయన ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమెరికా-పాకిస్థాన్ సంబంధాలపై ఆయన సూటిగా మాట్లాడారు. పాకిస్థాన్-అమెరికా సంబంధాలకు సంబంధించి విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పాలంటే.. ఇది పాకిస్థాన్ ప్రయోజనాలకు గానీ, అమెరికా ప్రయోజనాలకు గానీ పనికిరాని బంధమని అన్నారు. కాబట్టి ఈ బంధం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మరియు దాని నుండి తమకు ఏమి ప్రయోజనం చేకూరుతుంది అని యుఎస్ ఆలోచించాలని అన్నారు.

ఇటీవల పాకిస్తాన్ F-16 విమానాల ఫ్లీట్ నిర్వహణ ప్యాకేజీని US $ 450 మిలియన్ల మేరకు అమెరికా ఆమోదించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి అనే పేరుతో మీరు ఎఫ్‌-16 వంటి విమానాలకు ప్యాకేజీలు ఇవ్వడం ఎవరిని మోసం చేయడానికి అని ప్రశ్నించారు.

Related posts

కారణ జన్ముడు కేసీఆర్: మంత్రి హరీష్ రావు

Bhavani

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు సిద్ధం చేయండి

Bhavani

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు విడుదల చేయండి

Satyam NEWS

Leave a Comment