39.2 C
Hyderabad
April 28, 2024 14: 28 PM
Slider వరంగల్

కాంగ్రెస్ నేతల అరెస్టులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

#mulugu congress

అక్రమ అరెస్ట్ లు ప్రజాస్వామానికి గొడ్డలిపెట్టు అని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. టీపీసీసీ ఆదేశాల మేరకు చలో రాజ్ భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ చేయడాన్ని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.

ఈ రోజు వెంకటా పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెగాసెస్ అనే ఇజ్రాయిల్ సాఫ్ట్ వేర్ సహాయం తో  సెల్ ఫోన్.. ట్యాపరింగ్ చేస్తూ కేంద్రప్రభుత్వం వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నదని ఆయన అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామిక ధోరణి కి నిరసనగా AICC అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇందిరా పార్క్ నుండి రాజ్ భవన్ వరకు జరిగే ర్యాలీ కి వెళ్లకుండా కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ అరెస్ట్ లతో ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో వున్నాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వాని కి గుణపాఠం చెబుతారని బండి శ్రీనివాస్  అన్నారు.

ఈ కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,జిల్లా నాయకులు మిల్లురి ఐలయ్య, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగీలి రవి,గ్రామ కమిటీ అధ్యక్షులు నాగరాజు,గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు నల్ల కోటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు: సతీష్ యాదవ్

Satyam NEWS

సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపు రద్దు

Bhavani

ఆర్మీ జవాన్ కి ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూమిని మింగేశారు

Bhavani

Leave a Comment