29.7 C
Hyderabad
May 4, 2024 05: 44 AM
Slider నిజామాబాద్

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మార్పీఎస్

#kamareddy

భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిజం సాగర్ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్. బాగయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలని అనే వాక్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహిరంగంగా భారత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంతి పద్మారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, సీనియర్ నాయకురాలు రజిత, మెట్టు పర్వయ్య, పురుషోత్తం. లింగం ,రూప, స్వాతి, రాజు రేణుక గణేష్, పెంటయ్య, చిన్న రాజయ్య శాలిని, కార్తిక్ , ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలి: సి ఐ టి యు

Satyam NEWS

వణికిస్తున్న మద్రాస్ ఐ

Murali Krishna

క్వశ్చన్: తిరుమల తిరుపతి దేవస్థానంపై సీక్రెట్ ఎందుకు?

Satyam NEWS

Leave a Comment