31.2 C
Hyderabad
May 2, 2024 23: 27 PM
Slider ముఖ్యంశాలు

హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలి: సి ఐ టి యు

#seetapati

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకి అనుగుణంగా బజారు హామాలీల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి హోల్ సేల్ వ్యాపారస్తులని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లోని సిమెంట్ మట్టి పైపులు,ఐరన్,మార్బుల్,సిమెంట్ రేకులు తదితర వస్తువులు వ్యాపారం చేసే హోల్సేల్ యాజమాన్యం కొత్త వెంకన్న, కామిశెట్టి శేఖర్,తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి యాజమాన్యాలకి కార్మికులు డిమాండ్ నోటీసు మంగళవారం ఇచ్చారు.

ఈ సందర్భంగా శీతల రోషపతి మాట్లాడుతూ గతంలో చేసుకున్న అగ్రిమెంటు రెండు సంవత్సరాలు పూర్తయినందున తిరిగి అగ్రిమెంట్ కై చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యాపార యాజమానులను కోరారు.కేంద్రంలో ప్రభుత్వం వంట గ్యాస్,పెట్రోలు,డీజిల్ రేట్లు పెంచడంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయిని,రాష్ట్రంలోని ప్రభుత్వ విద్య చార్జీలు పెంచడంతోపాటు పామాయిల్ ఒక్కసారిగా డబల్ రేట్లు పెరిగాని,సామాన్యుడు అయోమయంలో పడ్డారని అన్నారు. అలాగే  కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.

బజారు హమాలి యూనియన్ సిఐటియు అనుబంధం అధ్యక్ష్య, కార్యదర్శులు మైపాల్,కారంగుల వెంకన్న, రాపోలు ప్రేమ్,సాంబయ్య,కత్తి శీను,రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

అభిష్టి వెల్ఫేర్ సొసైటీ సేవలు అభినందనీయం

Satyam NEWS

తిర్యాని మండలంలో దారుణ హత్య

Satyam NEWS

ఉద్యోగం చేసే మహిళ గర్భవతి కావడం తప్పా?

Satyam NEWS

Leave a Comment