29.7 C
Hyderabad
May 6, 2024 03: 41 AM
Slider ప్రత్యేకం

వణికిస్తున్న మద్రాస్ ఐ

#eye

తమిళనాడు ప్రజలను మద్రాస్‌ ఐ వణికిస్తోంది. ఆస్పత్రులన్నీ కళ్లకలక బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 2వందల నుంచి 250మంది వరకు చికిత్స పొందుతున్నారు. మదురైలో మద్రాస్‌ ఐ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్‌ నుంచి అధిక వర్షాలతో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కళ్లమంట, దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం, కనురెప్పులు అంటుకుపోవడం, కళ్లు తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 4,500 మంది కంటి సమస్యలతో చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు లక్షన్నర మందికి ట్రీట్‌మెంట్‌ అందించినట్టు అధికారులు తెలిపారు. కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు సరైన వ్యైద్యం తీసుకోవాలని, అలాగే ఇది అంటువ్యాధి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ వైరస్ సోకిన వారు నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related posts

పంట తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

వృద్ధ నేతలకు ఎగ్జిట్ చూపిస్తున్న కమలదళం

Satyam NEWS

విద్యార్ధులకు తగిన సౌకర్యాలు కల్పించాలి

Satyam NEWS

Leave a Comment