30.7 C
Hyderabad
May 5, 2024 04: 53 AM
Slider నిజామాబాద్

నిరుద్యోగుల విస్మరించిన ప్రభుత్వం

#ravinayak

9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో నియామకాల పేరుతో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఓయూ విద్యార్థి నాయకుడు రవినాయక్ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పై బరిలో ఉన్న రవినాయక్ నామినేషన్ పత్రాల పరిశీలన సందర్భంగా కామారెడ్డికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో ఇద్దరు ఉద్దండులు పోటీలో ఉన్నారని, వారికి నిరుద్యోగుల బాధలు, కష్టాలు తెలియాలనే కామారెడ్డిలో పోటీకి సిద్ధం కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం పరీక్షల్లో 150 ప్రశ్నలు సరైన రీతిలో తయారు చేసే స్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేదన్నారు. పేపర్ లీకేజీల, నోటిఫికేషన్ల రద్దు నిరుద్యోగులకు శాపంగా మారాయన్నారు. రైతులకు సరైన న్యాయం చేయడం లేదన్నారు. కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు రావడానికి 21,22 ప్యాకేజి పనులు పూర్తి చేయడంలో తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. అందుకే విద్యార్థి, నిరుదోగులు అధిక సంఖ్యలో పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 15 న తమకు గుర్తు కేటాయింపు జరుగుతుందని 15 వ తేదీ నుంచి ఓయూ, కాకతీయ యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులు ప్రతి గ్రామంలో ప్రచారం చేసి కేసీఆర్ ను ఒడిస్తామని తెలిపారు. ఇలా అయినా సీఎం కేసీఆర్ లో మార్పు వస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ఓటు మన చేతిలో ఉన్న వజ్రాయుధం

Satyam NEWS

బెలూచిస్తాన్ లో మళ్లీ ఉగ్రదాడి: ఇద్దరి మృతి

Satyam NEWS

రాజీ మార్గమే నిజమైన రాజమార్గం

Satyam NEWS

Leave a Comment