28.7 C
Hyderabad
May 6, 2024 10: 15 AM
Slider ముఖ్యంశాలు

ఓటు మన చేతిలో ఉన్న వజ్రాయుధం

#cbit

సిబిఐటి కళాశాల లో నేడు ఘనం గా జాతీయ ఓటర్లు దినోత్సవం జరిగింది.  సి బి ఐ టి లో ఎలక్ట్రోల్ లిటరసీ క్లబ్ గత మూడు రోజులుగా వివిధ ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ముగింపు కార్యక్రమానికి  ముఖ్య అతిధి గా రాజేంద్ర నగర్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ చంద్రకళ  విచ్చేసి ప్రసంగిచారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ మన ఎన్నికల విధానం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎన్నికలలో ఒకటి.  ప్రతి ఒకరు ఓటు వేయడం అనేది ఒక బాధ్యత గా స్వీకరించాలి అని ఆన్నారు. చాలా ఎన్నికల్లో ఇతర వ్యక్తుల కంటే మురికివాడల ప్రజలు వచ్చి ఓటింగ్‌ చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు ఓటు వేసేందుకు రావడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. నేర చరిత్ర గల వారిని ఎన్నికోకుండా చూసుకోవసిన బాధ్యత ప్రతి ఒకరిది. ఓటు  అనేది ఒక వజ్రాయుధం అని గుర్తు  పెట్టొకొవాలి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీబీఐటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రవీందర్‌రెడ్డి, విద్యార్థుల కార్యకలాపాల సలహాదారు శ్రీనివాసశర్మ మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ జిఎన్‌ఆర్‌ ప్రసాద్‌, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

విస్తృతంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు

Satyam NEWS

ట్వీట్ అండ్ డిలీట్: అన్నా ఇక చాలే వదిన్ని పిలువు

Satyam NEWS

బిగ్ డేటా పై ఆన్ లైన్ లో సదస్సు

Satyam NEWS

Leave a Comment