33.7 C
Hyderabad
April 29, 2024 02: 37 AM
Slider శ్రీకాకుళం

జనవరి 5,6,7 తేదీలలో రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు

#gajalsrinivas

ఆంధ్రసారస్వతా పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహశ్రాబ్ది ఉత్సవాల నీరాజనం గా రాజ మండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా అంతర్జాతీయ తెలుగు మహా సభలను 2024 జనవరి 5,6,7 వ తేదీలలో నిర్వహించనున్నట్లు  ఆంధ్రసారస్వతా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు తెలుగు మహాసభల సమన్వయ కర్త డాక్టర్ కేశిరాజు రాంప్రసాద్ సూచనలు మేరకు శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ గా లఖినాన. రవికుమార్ ను, కో కన్వీనర్ గా డాక్టర్ కళ్ళేపల్లి. ఉదయ్ కిరణ్ ను నియమిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ గంజి. ఏజ్రా, డాక్టర్ లీలా ప్రసాద్, డాక్టర్ కొంక్యాన. వేణుగోపాల్, సంపతి రావు సౌమ్య, డాక్టర్ భోగెల ఉమామహేశ్వరరావు, డాక్టర్ తెప్పల కృష్ణ మూర్తి, ఎల్. వెంకటాచలం, కుమార్ నాయక్, పి. సంతోషి, చౌదరి లక్ష్మణ్ రావు, పైడి రాము, బి. నేతాజీ,కె. భుజంగరావు, కట్టా. పార్ధ సారధి, దువ్వారి. చలపతి రావు, డాక్టర్ తారక రామారావు, తదితరులును, నియోజకవర్గం వారీగా కమిటీలను నియమించినట్లు తెలిపారు. ఆంధ్రమేవ జయతే అన్న తెలుగు నినాదంతో తెలుగు భాషా లో ఇరవై ఐదు సాహితీ ప్రక్రియల పై ప్రముఖతో సదస్సులు, వేయిమంది కవులతో కవితా నీరాజన కార్యక్రమం ఉంటుందని ఈ ఉత్సవాలకు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రముఖుల తో పాటు, పీఠదిపతులు, చలన చిత్ర ప్రముఖులు యాభై దేశాల నుండి ప్రతినిధులు హాజరు కానున్నారని మరిన్ని వివరాలకు,9573544569,9494188200,7702738111 లను సంప్రదించాలన్నారు.

Related posts

ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ సభ్యుడు గా యరగాని నాగన్న గౌడ్

Satyam NEWS

కేటీఆర్ ను కలిసిన అరూరి

Bhavani

మూసి ఉన్న స్కూలుకు ముఖ్యఅతిధి

Satyam NEWS

Leave a Comment