40.2 C
Hyderabad
April 26, 2024 11: 35 AM
Slider నల్గొండ

రాజీ మార్గమే నిజమైన రాజమార్గం

#LokAdalat

క్షణికోద్రేకంలో చేసిన తప్పులకు కేసులపాలై కోర్టులో చుట్టూ తిరుగుతున్న వారికి ‘రాజీ మార్గమే రాజమార్గం’సివిల్ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి శ్రీదేవి మాట్లాడుతూ భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

లోక్ అదాలత్ ల వలన సమయం, డబ్బు ఆదాతో పాటు కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని, కోర్టుకు చెల్లించిన ఫీజులు తిరిగి పొందవచ్చని, ఇరుపక్షాల వారు స్నేహపూర్వకంగా కలసిమెలసి ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

కోర్టులో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించడం వంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. కక్షీదారులు తమ కేసులను రాజీ చేసుకొని అందరూ శాంతియుతంగా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని కోరారు. మెగా లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు 278,సివిల్ కేసులు 3 పరిష్కారం కాగా జరిమానాల రూపంలో 9 లక్షల 35 వేల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యాయి.

ఈ కార్యక్రమంలో సిఐ రాఘవరావు,APP శ్రీనివాసరెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు చెన్నగాని యాదగిరి, భట్టిపల్లి ప్రవీణ్ కుమార్, చల్లా కృష్ణయ్య, మద్దుల నాగేశ్వరావు, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, మీసాల అంజయ్య, కొట్టు సురేష్, వి జి కె మూర్తి, పెడపర్తి అంజయ్య,

కుక్కడపు నరసింహారావు, ఒట్టి కోటి అంజయ్య, చనగాని మహేష్, లతీఫ్, శ్రీనునాయక్, శంకర్, వెంకటేష్,SI వెంకట్ రెడ్డి, విష్ణు, వెంకన్న, యాదవేంద్ర రెడ్డి, నరేష్, కోర్టు సిబ్బంది శ్యామ్ కుమార్, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొత్తపల్లి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన దహేగం

Satyam NEWS

భవిష్యత్తును భూతద్దంలో చూపిన దుబ్బాక ఫలితాలు

Satyam NEWS

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సిబ్బందికి కరోనా

Satyam NEWS

Leave a Comment