28.7 C
Hyderabad
May 5, 2024 07: 58 AM
Slider ప్రత్యేకం

రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి సీఎంగా అనర్హుడు

#madhavaramkantharao

భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తికి ఒక్క నిమిషం కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని కూకట్ పల్లి నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ మాధవరం కాంతారావు అన్నారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కెసిఆర్ ఆర్టికల్ 3 లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎలా ఏర్పడిందో చెప్పాలన్నారు. కొన్ని వేల పుస్తకాలను చదివాను అని గొప్పలు చెప్పుకునే కెసిఆర్ కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

100 మంది కెసిఆర్ లు వచ్చినా భారత రాజ్యాంగాన్ని మార్చలేరన్నారు. కెసిఆర్ కు రాష్ట్ర ప్రజలపై, వ్యవస్థపై విశ్వాసం లేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందడం కెసిఆర్ కు ఇష్టం లేదని విమర్శించారు.

బడుగు బలహీన వర్గాల పై కేసిఆర్ ఉన్న ద్వేషం మరో సారి బయటపడిందని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తా అన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనానని  ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించిన కెసిఆర్ బేషరతుగా అంబేద్కర్ కు,  దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

నరసరావుపేటలో కొప్పరపు కవుల విగ్రహ ప్రతిష్ట

Satyam NEWS

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి

Bhavani

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

Satyam NEWS

Leave a Comment