29.7 C
Hyderabad
May 4, 2024 05: 21 AM
Slider మహబూబ్ నగర్

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును దేశం నుండి తరిమేయాలి

#mandakrishnamadiga

భారత రాజ్యాంగంపై, అంబేద్కర్ పై ప్రజలకు గౌరవం ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైఖరిని ఎండగట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై గురువారం మందకృష్ణ మాదిగ నాగర్ కర్నూల్ జిల్లా  కొల్లాపూర్ పట్టణ  కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగానికి, దళితులకు  సంబంధం లేదని కేసీఆర్ చేసిన  వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ దళిత ద్రోహి అని అన్నారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తేనే దేశద్రోహ కేసు పెడతారు. అలాంటిది  భారత రాజ్యాంగాన్ని మార్చాలని అవమానించిన కెసిఆర్ ను దేశ బహిష్కరణ చేయాలనీ అన్నారు.

అదేవిధంగా దళితులకు రాజ్యాంగానికి సంబంధం లేదని దళితులను అవమానపరిచిన కేసీఆర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. సామాజిక న్యాయం, సామాజిక బాధ్యత అంటే కెసిఆర్ కు గిట్టదన్నారు. అందుకే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. భారత రాజ్యాంగంపై, అంబేద్కర్ పై గౌరవం ఉన్నవాళ్లు కెసిఆర్ ను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.కెసిఆర్ ను దేశం నుండి  తరిమేయాలి అన్నారు.

రిజర్వేషన్ పెంచడం కోసమే రాజ్యాంగం మార్చాలనుకుంటే?

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేశారని మందకృష్ణ మండిపడ్డారు. పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు19 శాతం రిజర్వేషన్ పెంచాలి,అందుకే రాజ్యాంగం మార్చాలి అని కేసీఆర్ మాట్లాడిన మాటలకు మంద కృష్ణ మాదిగ దిమ్మతిరిగే  విధంగా సమాధానం ఇచ్చారు.పెరిగిన జనాభా శాతం ప్రకారం రిజర్వేషన్ పెంచే అవకాశం  రాష్ట్రాలకు ఉందనీ చెప్పారు.

19 శాతం రిజర్వేషన్ పెంచడానికి రాజ్యాంగం మార్చాలనుకుంటే మరి ఎస్సీలకు ఉత్తర ప్రదేశ్ లో 21%, హిమాచల్ ప్రదేశ్ లో 25% పంజాబ్ లో 29 శాతం ఉన్నా సంగతినీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు గుర్తు చేశారు.అదేవిధంగా మహిళలకు  రిజర్వేషన్ శాతం పెంచాలి. అందుకే రాజ్యాంగ మార్చాలని కూడా కేసీఆర్ మాట్లాడారు. వాటికి కూడా మందకృష్ణ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణ క్యాబినెట్ లో 18 మంది మంత్రులు ఉంటే ఎంత మంది మహిళలకు అవకాశం కల్పించారా అని కెసిఆర్ ను ప్రశ్నించారు. అనంతరం  తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సెక్షన్ లు యాడ్ చేస్తూ  కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అంబేద్కర్ విగ్రహాన్ని  ఎమ్మెల్యే,పోలీస్ లు బాధ్యత వహించాలి

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఉన్నచోటనే అభివృద్ధి చేయాలి, అంతేగాని విగ్రహాన్ని ఈంచ్ కదిలించినా జరిగే పరిణామాలకు స్థానిక ఎమ్మెల్యే, పోలీసు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. హైదరాబాద్  లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర పైనుంచి బ్రిడ్జ్ వస్తుందని అంబేద్కర్ విగ్రహాన్ని కదిలించాలనీ  చూస్తే ఈంచు కూడా కదలనివ్వలేదన్నారు.

ఈ అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే కు, పోలీసు అధికారులకు  గుర్తు చేశారు. ఉన్నచోటనే విగ్రహాన్ని డెవలప్ చేయాలని అన్నారు.లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, దళితుల, అంబేద్కర్ వాదుల, ప్రజాసంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రస్తుతం వున్న డిజైన్ నమూనా ప్రకారమే డెవలప్ చేయాలన్నారు. అంబెడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో  ఇది జరగాలన్నారు.

దళిత, గిరిజనులపై స్థానిక పోలీస్ అధికారుల చిన్న చూపు

కొల్లాపూర్ లో దళిత, గిరిజనులపై స్థానిక పోలీస్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారనీ మంద కృష్ణమాదిగ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. చట్టాలను గౌరవించని  పోలీసులు దళిత, గిరిజనులకు న్యాయం చేయలేరాన్నారు. చట్టాలను గౌరవ ఇస్తేనే దళిత, గిరిజనులకు న్యాయం చేయగలరని మందకృష్ణ మాదిగ అన్నారు.పోలీస్ లు  నిజాయితీతో బాధ్యతగా  విధులు నిర్వహించాలన్నారు. దళిత,గిరిజనులపై దాడులు, హత్యాచారాలు పెరిగి పోతున్నాయన్నారు. అగ్రవర్ణాలకు కొమ్ము కాయ కుండా  చట్టాలకు అనుగుణంగా పోలీస్ లు నడుచుకోవాలన్నారు.

కొల్లాపూర్ లో పోలీస్ ల నుండి దళిత, గిరిజనులకు న్యాయం జరగడం లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. తర్వాత జరగబోయే పరిణామాలకు పోలీస్ లు బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోల శివ, మాలల చైతన్య సమితి ఉపాధ్యక్షుడు బిజ్జ దేవదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాసు,ఎమ్మార్పీఎస్ నాయకులు పుట్టపాక రాము,నాగుల పల్లి లక్ష్మయ్య, సంపంగి నరసింహ,ఇతర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో రోడ్లు అభివృద్ధికి నిధులు

Satyam NEWS

విజయనగరం జిల్లా స్థాయి అధికారుల‌ను ప‌ట్టి పీడిస్తున్న మ‌హ‌మ్మారి

Satyam NEWS

జైపూర్ ఫుట్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Satyam NEWS

Leave a Comment