28.7 C
Hyderabad
May 6, 2024 09: 41 AM
Slider రంగారెడ్డి

దేశానికే నూతన దిశ కెసిఆర్ : మంత్రి హరీష్ రావు

#ministerharishrao

హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని  చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్  ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు వేడుకలను చిల్కానగర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆర్థిక & వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు,  ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్యమత ప్రార్థనలు నిర్వహించి మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్యే, కార్పొరేటర్ చేతుల మీదుగా  భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్  ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

టీఆర్ఎస్ పార్టీ లో చేరికలు

అనంతరం టిఆర్ఎస్ నేత బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో  పోటీచేసిన సీపీఎం అభ్యర్థి  భాగ్యలక్ష్మి, అశోక్ చారి, టీడీపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాలెందర్ వారి అనుచరగణంతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని మంత్రి హరీష్ రావు  టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలో  సాదరంగా ఆహ్వానించారు.

దుప్పట్ల పంపిణీ

కెసిఆర్  పుట్టినరోజు సందర్భంగా జి హెచ్ ఎం సి పారిశుద్ధ్య కార్మికులకు భారీ ఎత్తున మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి చేతుల మీదుగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు హరీష్ రావు, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ,కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఒక దిశ అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధివైపు నడిపిస్తున్న మహా నేత అని కొనియాడారు. వారు ఇలా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని భారతదేశానికి ఒక మహా నేత గా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్ రెడ్డి, వీబీ నరసింహ, రాంరెడ్డి, నేర్డం భాస్కర్ గౌడ్, జల్లీ మోహన్, ప్రతాప్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి కొక్కొండ జగన్, కైలాసం (కెసిఆర్) మాస శేఖర్, బింగి శ్రీనివాస్, పుష్ప రాజ్ , బాణాల నారాయణరెడ్డి, మహమూద్, పండ్ల కిషన్ ,  ఫరూఖ్, అల్లిబిల్లి మహేందర్, రామానుజన్,జంపని బాలు, సకినల ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, సత్యరాజ్ గౌడ్, రవీందర్ గౌడ్, బంటి గౌడ్, రామ్ చందర్, ఉపేందర్, యాదగిరి,  పోచయ్య, రమేష్, ధనుంజయ్,సుందర్,యాదగిరి, పోచయ్య, డాక్టర్ భాస్కర్, కేశవ్ నాయక్, జిల్లాల ప్రవీణ్, సుభాష్, కర్ణాకర్, సంతోష్, బాలు, ఆకాష్, శివ, వెంకటేష్, శ్రీకాంత్, బిట్టు, మహిళా నాయకులు అండాలు, అనసూయ, షహనాజ్, సత్యవతి, కనక తార, శారద,సరిత, అంజలి, విజయ్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ప్రజా పాలనలో వనపర్తి ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

కోవిడ్ మృతులకు వెంటనే పరిహారం చెల్లించాలి

Satyam NEWS

“దిశ జాగృతి”తో పోక్సో నేరాలు తగ్గుముఖం

Satyam NEWS

Leave a Comment